-
-
మా బడి
Maa Badi
Author: Tenneti Kodandaramaiah
Publisher: Mitramandali Prachuranalu
Pages: 280Language: Telugu
ఈ కోదండరామయ్య గారెవరో సామాన్యుడు కాదు. గోదావరిని అడ్డంగా, నిలువుగా, ఐమూలగా యీదేశారు. పదిమంది భ.కా.రా.లు, నలుగురు మునిమాణిక్యాల పెట్టు. స్కూలు పాలిటిక్సు, వూరి రాజకీయాలు, లిటిగేషన్లు – లాపాయింట్లు చెప్పే తీరు అద్భుతం. పాఠోళి పచ్చిపులుసు కాంబినేషన్లు! వెంకట్రావుతో కలిసి మళ్లీ చదువుకోవాలి. పుస్తకం జాగ్రత్తండోయ్.....
- బాపు
ఈ గ్రంథం నేను రెండుమాట్లు చదివాను. గ్రంథం యెక్కడ విప్పినా బుద్ధి చమత్కృతం అవుతూనే వుండేది. హృదయమున్నూ ఆనంద ముగ్ధం అవుతూ వుండేది. ఆ రెండు మాట్లూ కూడా అయ్యో!,అలాంటి హైస్కూల్లో చదివే యోగ్యత మనకు పట్టలేదే!అన్న పరితాపమున్నూ కలుగుతూ ఉండేది.
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
ఈ రచనలోని తెలుగు జాతీయం ఆయన పిలిస్తే పలికి చెప్పిన పనల్లా చేసిపెట్టింది. సాధారణ రచయిత అనుభవించి అందుకోలేని తెలుగు పలుకుబడి ఈ రచనలో ఉంది.
- భమిడిపాటి కామేశ్వరరావు
