• Lover
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    90
    20% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లవర్

    Lover

    Pages: 244
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

వెంకట్రామయ్య కళ్ళలో శభాష్‌ అన్న ఎక్స్‌ప్రెషన్‌ కనిపించింది.

''ఒక చిన్న కుర్రాడు తన తల్లిని నేను ఈతకు వెళ్ళనా అని అడిగాడు అందుకామె వద్దంది.... ఈతకొట్టాలనుకునే చెరువు లోతు ఎక్కువ అంది. అందుకా కుర్రాడు డాడీ కొడుతున్నాడుగా అని ప్రశ్నించాడు. అప్పుడ తల్లి ఏం సమాధానం చెప్పి కొడుకును సమాధాన పరుస్తుంది?''

పృద్వి వెంటనే ఏదో చెప్పబోయి ఓ క్షణం తనను తాను తమాయించుకున్నాడు. ముందు అనుకున్నదే చెప్పి వుంటే అది భవిష్యత్తులో పెద్ద అవమానాన్ని, ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది.

''డాడీ లైఫ్‌ ఇన్సూర్‌ చేసుకున్నాడు.... అని సమాధాన పరుస్తుంది...''

వెంకట్రామయ్య బొజ్జ కదిలేలా నవ్వాడు.

''ఒక అమ్మాయి నిన్ను-నన్ను ప్రేమించావా అంటుంది. ప్రేమించాను అంటావు. అయితే నాకోసం ఛస్తావా అంటుంది. అప్పుడు నువ్వేమంటావ్‌?''

''నా ప్రేమ చావదు. ప్రేమకు అసలు చావు లేదు. కనుక నేనూ చావను అంటాను.''

వెంకట్రామయ్య మొట్టమొదటిసారి పృద్విని చూసి ఒకింత కంగారు పడ్డాడు. ఇంత తెలివి కలవాడు ఎదురు తిరిగితే....?! అని.

''ఆఖరి ప్రశ్న....ఒక వ్యక్తి వెంకోజీ దగ్గరకు వచ్చి ఒక యువకుడు మీ అమ్మాయిని ముద్దు పెట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుండగా నేను చూశాను అంటాడు. పెట్టుకున్నాడా అని వెంకోజీ ఆందోళనగా అడుగుతాడు. అతను పెట్టుకోలేదు అంటాడు. అప్పుడు వెంకోజీ ఏం అంటే నాకానందంగా వుంటుంది?''

పృద్వి నవ్వాడు.

''అయితే ఆ అమ్మాయి నా కూతురు కాదు అని అంటే...''

వెంకట్రామయ్య పగలబడి నవ్వాడు. అతని శాడిస్టిక్‌ ఇన్‌స్టింక్ట్‌ తృప్తిపడింది.

''అయితే...నువ్విక నాకు నచ్చినట్లే....వెంకోజీని దెబ్బకొడితే నువ్వు పూర్తిగా నాకు నచ్చుతావు. కాక్కావాల్సిన మనిషివవుతావు.... విష్‌ యూ బెస్టాఫ్‌ లక్‌... బై...'' అన్నాడు.

పృద్వి కృతజ్ఞతలు చెప్పి బయటపడ్డాడు.

Preview download free pdf of this Telugu book is available at Lover