-
-
లవంగి
Lavangi Natakamu
Author: K. V. L. N. Sarma
Publisher: Chinuku Publications
Pages: 135Language: Telugu
సంస్కృత భాషలో అగ్రశ్రేణి అలంకారీకుడు జగన్నాథ పండిత రాయలు. ఆ మహనీయుని జీవిత విశేషాలను మాలభిత్తికలుగా చేసుకొని శ్రీ కె.వి.యల్.యన్ శర్మగారు మహత్తరమైన నాటకాన్ని నిర్మించడం అభినందనీయం. మీ రచనాశక్తికి నా హార్ధికాభినందనలు.
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి
పండిత రాయల జీవిత చరిత్రను ఈ 'లవంగి' నాటకంలోని ప్రతి దృశ్యంను అద్భుతంగా చిత్రించినందులకు ప్రేక్షకుల మన్ననలందుకోగలరు. ఇంతటి అద్భుత చారిత్రక నాటకాన్ని అందజేసిన శ్రీ కె.వి.యల్.యన్. శర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
- డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి
'లవంగి' ఒక దృశ్యకావ్యం. శ్రీ శర్మగారు రచించిన లవంగి అనే రంగస్థల నాటకం చదవటం వల్ల నా చిన్నతనంలో లవంగి అనే పేరు గల సినిమా చూశాను. ఆ జ్ఞాపకాల స్మృతులని ఒక్కసారి మనసులో పెల్లుబికినవి, తొలుత ఇలాంటి మంచి ఇతివృత్తాన్ని ఎన్నుకొని నాటకం వ్రాసిన ఘనత శ్రీ కె.వి.యల్.యన్. శర్మ గారికి దక్కింది. శర్మగారిని అభినందిస్తున్నాను.
- నాట్యావధాని డా. ధారా రామనాథశాస్త్రి
