• Lakshyam K Vasavadatta Ramana
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లక్ష్యం - కె. వాసవదత్త రమణ

    Lakshyam K Vasavadatta Ramana

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''రాధా! నెల రోజులయ్యింది! ఇంకా నాతో మాట్లాడవా! కోపం తగ్గలేదా?'' సుధీర్‌ చిన్న ముఖం పెట్టుకుని అన్నాడు.
రాధ కళ్లలో నీళ్లు తిరిగాయి. ముఖం పక్కకి తిప్పుకుంది.
''రాధా! నాదీ చాలా పొరపాటే! నన్ను క్షమించు! ఇంకెప్పుడు అలా చెయ్యను!'' ''ఫ్లీజ్‌ రాధా!''
అతని కళ్లలో నీళ్లు చూసి రాధ పూర్తిగా కరిగిపోయింది.
''ఇంకెప్పుడు అలా చేయకు సుధీర్‌! తప్పు ఎప్పుడు చేసిన తప్పే!! నీలో మార్పు రావడం వల్ల తప్పు ఎప్పటికి ఒప్పు అయిపోదూ, కాని తప్పు చేసిన మనిషిని క్షమించడం ఇవతల వ్యక్తిలోని ఔదార్యానికి సంబంధించింది. నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇలాంటి గాయం మానాలంటే నాలాంటి వాళ్లకి జీవిత కాలం పడుతుంది. కానీ నువ్వు మళ్లీ అలాంటి తప్పే మళ్లి చేసావో, నాకిక జీవితమే ఉండదు!'' వెక్కిళ్లతో ఏడుస్తూ రాధ అతని చేతుల్లో వాలిపోయింది.
కాలేజిలు తెరిచారు. అబ్బాయిలు వెళ్లారు. అమ్మాయిలు సెలవుల్లో వాళ్ల రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. సుధీర్‌ వచ్చినప్పుడు రాధకు ఎల్లలు లేని ఆనందం. అతను ఏడాది, ఏడాదికి, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతుంటే, తన మనిషి, తన వాడన్న తృప్తి, గర్వం రాధలో కళ్లలో కనిపించేది. ''జానకి పెళ్లి పై ఆదివారమే!'' కళ అంది వేసవి సెలవల్లో అందరు కలిసినపుడు.
''ఆ రెండు రోజులు సరదాగా తిరగాలి, మన చిన్నప్పటి ముచ్చట్లన్ని మళ్ళీ చెప్పుకోవాలి!'' సుధీర్‌ అన్నాడు, కొంటెగా రాధ కేసి చూస్తూ!
''పెళ్లి పక్క ఊర్లో వాళ్ల తాతగారింట్లో చేస్తున్నారు! అందరం అక్కడ కలుద్దాం!'' రాము అన్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Lakshyam K Vasavadatta Ramana