-
-
కుంతల
Kuntala
Author: Chalasani Vasumathi
Publisher: Madhuri Prachuranalu
Pages: 132Language: Telugu
"కుంతల'' నవలలోని అనేక పాత్రలు వాస్తవ జీవితంలోని వ్యక్తులకు ప్రతిబింబాలు. అలా అని ఇది వాస్తవానికి కేవలం అనుకరణ అంటే అదీ కాదు. వాస్తవానికి కల్పన జతగూడింది. కళా సృష్టి చేసే సందర్భంలో కేవలం సృష్టిని అనుకరించడం ఆరంభిస్తే అది కళే అన్పించుకోదు. కేవలం సృష్టి అనుకరణ కళయొక్క ధర్మం కాదు. కళాసృష్టి నిర్మాణ క్రమంలో రసస్రష్ట తాను అనుభవించినదానికి ప్రతిభా విశేషం. ఈ రెండింటినీ సౌందర్యంతో పరిపూర్ణంగా మేళవించటమే కళ. ఈ నవలలో వాస్తవికత విషయాల క్రోడీకరణేకాక రచయిత్రి తానివ్వదలుచుకున్న వ్యాఖ్యానాన్ని కూడా అంతస్సూత్రంగా ఇమిడ్చి రచన సాగించింది.
ఈ నవలలోని పాత్రలనేకం రచయిత్రి జీవిత చరిత్ర పుటలలో మసలుతున్న వ్యక్తులే. ఇక్కడ మరొక్క విషయం వుంది. వాస్తవిక స్పర్శలేని కల్పన అంటూ లేనేలేదు. చిరవరకు ఉత్ప్రేక్ష అలంకారంలో కూడా వాస్తవిక గంధం అంతో ఇంతో వుంటుంది. "కుంతల''లోని అన్ని పాత్రలు వాస్తవిక జీవితంలోని రూపాలే. అయినా క్రొత్త రూపాలను, క్రొత్త క్రొత్త వ్యక్తిత్వాలను సంతరించుకుని మనకు దర్శనమిస్తాయి. ఇక్కడనే రచయిత్రి వైచిత్రి రచనా రంగంలోను వచనా రూపం ఇచ్చి విశ్వజనీరాజనం సార్వకాలికం చేసేందుకు ఈ ప్రక్రియ అవసరం అవుతుంది. అలా రచయిత చేతులలో వాస్తవిక వ్యక్తులు కొన్ని లక్షణాలు పోగొట్టుకుని, కొన్ని క్రొత్త లక్షణాలు రాబట్టుకుని, వినూత్నగతిలో మలచబడతారు. అలాగే ఈ నవలలోను మలచబడిన పాత్రలు సజీవంగా కళ్ళముందు మెదులుతాయి.
"కుంతల''లోని పాత్రలను గురించి పేరుపేరునా ఇక్కడ రూపాలకన్నా హృదయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. మరికొన్ని పాత్రలు రూపాయిలతోనే మనష్యుల విలువలను కట్టి జీవితాలతో చెలగాటాలాడుకుంటాయి. ప్రేమభావంతో స్నిగ్ధ హృదయంతో సర్వార్పణం చేసుకునే వ్యక్తులూ వున్నారు. ప్రేమ నటించి, ప్రేమకన్నా వాళ్ళకు విలువైన రూపాయిల సంగతి వచ్చేటప్పటికి సన్నిహితమైన వ్యక్తులనే అగాధంలోనికి తోసేసి దూరతీరాలలో అదృశ్యమయిపోయే వ్యక్తులూ ఇందులో కన్పిస్తారు. "కుంతల'' చదవటం ప్రారంభించండి. ఎవరు ఎవరో పోల్చుకోండి.
- శ్రీధరబాబు
