• Krutayug
  • Ebook Hide Help
    ₹ 134.4
    168
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృతయుగ్

    Krutayug

    Pages: 364
    Language: Telugu
    Rating
    4.09 Star Rating: Recommended
    4.09 Star Rating: Recommended
    4.09 Star Rating: Recommended
    4.09 Star Rating: Recommended
    4.09 Star Rating: Recommended
    '4.09/5' From 11 votes.
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    '3.80/5' From 5 premium votes.
Description

''స్వామీ తలుపుల్ని పరిశీలిద్దాం. తాళంచెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం'' అన్నాడు అన్నారావు.

''పిచ్చోడా! అదంత తేలికైన పననుకుంటున్నావా? పొరపాటున తలుపును తాకావంటే అయిపోతావ్‌. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళేనికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన వున్న బొమ్మల్ని గమనించావా? ఎవరుబడితే వాళ్ళు తెరవటానికి వీల్లేకుండా ఒక్కో గది తలుపుల్ని ఒక్కో బంధంతో బంధించివుంచారు. అమ్మా స్నిగ్ధా ఆ అక్షరాల్ని ఓసారి చదువుతల్లీ'' అన్నాడు. ఆమె చదివి చెప్పి ఆమె చెప్పిన ప్రకారం ఆ అక్షరాలు అది ఏ దేవత గదో చెప్తున్నాయి.

మొదటి గది ఆదివిష్ణుమూర్తిది కాగా మిగిలినవి ఒక్కో లక్ష్మికి ఒక్కో గది కేటాయించబడింది. అంటే ఎవరి నిధిని వారి గదిలోనే భద్రంచేసివుండాలి.

నిధిని చూడబోతున్న ఆనందంలో ఉన్నా అందరికీ అనంతస్వామి మాటలతో ఒక్కసారిగా నీరసం వచ్చినంత పనయింది.

''ఏమిటి స్వామీ. తలుపుల్ని తెరవలేమా?'' అడిగాడు కృతయుగ్‌.

''ప్రస్తుతం తెరవలేం'' వెంటనే బదులిచ్చాడాయన.

''అంత సులువుగా తెరుచుకోవు నాయనా. చూస్తున్నారుగా. అడుగుగునా మంత్రశక్తులతో ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేశారో. ఆదివిష్ణుగదికి నాగబంధం వేశారు. వరుసగా గదులకి గరుడబంధం-మండూకబంధం-వృశ్చికబంధం-గంధర్వబంధం ఇలా తొమ్మిదిగదులకు నవ బంధాల్ని ప్రయోగించి పెట్టారు. ఆ బంధాలు విప్పి దారాలు బొమ్మలు తొలగించకుండా తొందరపడి తాళం తెరిచే ప్రయత్నంచేస్తే నెత్తురుకక్కుకు చస్తారు. ఆ చావు చాలా ఘోరంగా ఉంటుంది'' వివరించాడు.

షాక్‌తో నిలబడిపోయాడు అన్నారావు. పొరపాటున తలుపుల్ని తీసివుంటే అయిపోయేవాడు. సమయానికి అనంతస్వామి ఆపబట్టి బతికిపోయాడు.

''ఇవన్నీ అంత ప్రమాదకరమైన బంధాలా?'' ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు కృతయుగ్‌.

Preview download free pdf of this Telugu book is available at Krutayug
Comment(s) ...

Very very great novel in the recent times.. with awesome details.. hats off to Suryadevara Rammohan rao garu.. great novel sir!

how to downlode these novels.
plzzzzzzz tell me

hai nenu rent book ki mny pay chesanu ani download avadamle book em cheyali

అద్భుతమైన విశ్లేషణలతో నిండిన ఈ కథ ఆసాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇటువంటి గొప్ప మిష్టరి పుస్తకాన్ని మాకు అందిచినందుకు ధన్యవాదాలు.

Excellent novel, thanks to ram Mohan rao sir

WHAT A GREAT COVER PAGE..SUPER COVER PAGE DESIGN.IS IT SEX BOOK?

SUPER, MARVELOUS, FANTASTIC