• Krishnaveni
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృష్ణవేణి

    Krishnaveni

    Author:

    Pages: 195
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రచయితలూ నేర్చుకోవాలి

ఏ రచయిత అయినా, తను రాసిన వాటిని, 20-30 ఏళ్ళ తర్వాత ఒక సారి చదివి చూసుకుంటే, ఆ రచనల్లో అతనికి ఏవైనా తప్పులు కనపడితే, ఆ రచయిత భావాలు, గతం కన్నా మారినట్టు అర్థం. లేదా, ఆ రచనల్లో ఏ తప్పులూ కనపడకపోతే, మొదట రాసినప్పుడే అవి తప్పులు లేనివి కావచ్చు; లేదా తప్పులు వున్నా వాటిని ఆ రచయిత గ్రహించలేదంటే, ఆ రచయిత భావాలు, ఆ రచన చేసిన కాలానికీ, తర్వాత కాలానికీ, ఏమీ మారక పోవడం కావచ్చు.

పురుషుడికి చతుర్వర్ణాల నుంచీ (నాలుగు కులాల నుంచీ) భార్యలు, ఆ పైన వేశ్యలు ఉండవచ్చని చెప్పిన విశ్వనాథ సత్యన్నారాయణ గారు, ఇంకో వంద సంవత్సరాలు జీవించి వుంటే, తను చెప్పిన విషయాలు తప్పని చెప్పుకునే వారా?

చలం గారి 'మైదానం' చూడండి! 'ప్రేమ' మీద చెప్పాలనే ప్రయత్నం అది. ప్రేమతో ఏర్పడని వైవాహిక సంబంధాల్ని నిరసించే ఈ కథ, ప్రేమకి అర్థాన్ని మార్చే, ప్రేమ సౌందర్యాన్ని వికృతం చేసే మార్గంలోకి తీసుకు పోయి విడిచి పెడుతుంది. ఈ రచయిత వృద్ధాప్యం దాకా జీవించారు. అయినా తన కథా వస్తువుల్లో ఏమైనా పొరపాట్లు జరిగాయేమోనని ఆయన పునర్విమర్శలు చేసుకోలేదు.

కొందరు రచయితలకు, తమ రచనల్లో పొరపాట్లు కొన్ని తెలిసినా, రచనలన్నిటినీ మళ్ళీ పరిశీలించడం సాధ్యం కాదు కూడా. రచయితలకు సాధ్యం కాని పని పాఠకులే చేసుకోవాలి.

సమస్యల మీద కథలు రాయాలంటే, సమస్యకి కారణాలు తెలియని మిడి మిడి జ్ఞానం పనికి రాదు. కనీసం సమస్యని సమస్యగా చూపించగలిగే జ్ఞానం అయినా వుండాలి. సమస్యని వాస్తవికంగా చూపించగలిగితే, పరిష్కారం దాని లోనే కనబడుతుంది.

రచయితలు అనే వాళ్ళు మాములు మనుషుల కన్నాగొప్ప మేధావులేమీ కారు. రచయితలు కూడా సమాజం ఇచ్చే భావాల తోనే నిండిపోయి వుంటారు. ఒక 'కళ' తెలిసినంత మాత్రాన వాళ్ళు అభ్యుదయ వాదులు కాలేరు. 'అభ్యుదయ భావాలు' అనే వాటిని ప్రత్యేకంగా నేర్చుకోవాలి. కానీ ఇలా చెప్పడం కూడా మళ్ళీ పొరపాటే. రచయితల్లో కూడా వర్గభేదాలు వుంటాయి. ఎవరి వర్గ భావాలు వారు ప్రదర్శిస్తారు.

అభ్యుదయం కోసం రాసే రచయితలైనా, తమ రచనల్ని కొంత కాలం తర్వాత ఒక సారి చూసుకుంటే, గతం కన్నా మారాలో, మారక్కర లేదో తెలుసుకుంటారు. మారక్కర లేకపోయినా గతంలో రాసినవి చాలా మంచివే అయినా, గతం కన్నా మరింత నేర్చుకోవాలి - అని తెలుసుకుంటారు.

Preview download free pdf of this Telugu book is available at Krishnaveni