• Kraistavam Inta Amanushama
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్రైస్తవం ఇంత అమానుషమా?

    Kraistavam Inta Amanushama

    Pages: 113
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శామ్ హారీస్ రచించిన "Letter to A Christian Nation" అనే పుస్తకానికి నరిశెట్టి ఇన్నయ్య గారి అనువాదం ఈ పుస్తకం.

* * *

‘నమ్మకానికి అంతం’ (ఎండ్ ఆఫ్ ఫెయిత్) అనే శీర్షికన నా తొలి పుస్తకం రచించినప్పటి నుండి దేవుణ్ణి నమ్మకపోవడంలో నేను తప్పు చేస్తున్నానని వేలాది మంది నాకు ఉత్తరాలు రాశారు. ఇందులో చాలా వ్యతిరేకమైనవి క్రైస్తవుల నుండి వచ్చాయి. ఇది విడ్డూరమైనది. ఇతరుల కంటే తమ మతం ప్రేమను, క్షమాపణను చాలా బాగా ఆచరణలోకి పెడుతుందని ఊహిస్తారు. క్రీస్తు ప్రేమ వలన మారిపోయామని చెప్పేవారు, విమర్శలు సహించలేక చాలా ఘాటుగా హత్యచేసేటంత కసిగా ఉంటున్నారు. ఇది మానవ స్వభావం అనుకోవచ్చు.

కానీ అలాంటి ద్వేషం బైబిల్ నుండి రాబట్టడం స్పష్టంగా ఉంది. ఇదెలా తెలుసు? నాకు ఉత్తరాలు రాసేవారు బైబిల్‌లో అనేక సూత్రాలను ఉదహరిస్తూ ఉంటారు.

ఈ పుస్తకం అన్ని మతాల వారిని ఉద్దేశించి ఉంది. కాని క్రైస్తవులకు బహిరంగ లేఖగా దీనిని బయటపెడుతున్నాను.

క్రైస్తవులు తమ మత విశ్వాసాలను సమర్ధిస్తూ వాదించే తీరును దృష్టిలో పెట్టుకుని రాశాను. మన సమాజంలో సెక్యులరిస్టులు మతాన్ని ప్రభుత్వాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు. వారిని సమర్ధిస్తూ ఈ రచన చేశాను. క్రైస్తవులు ఇందుకు వ్యతిరేకంగా తమ హక్కులకు పోరాడుతున్నారు. ఈ పుస్తకంలో క్రైస్తవం అని ఉద్దేశించింది పరిమిత దృక్కోణంలోనే. క్రైస్తవులు బైబుల్‌ను దైవ ప్రేరణ విధంగా భావిస్తారు. జీసస్ క్రైస్ట్‌కు దివ్యత్వం ఉన్నట్లుగా నమ్మినవారే మరణానంతరం ముక్తి పొందుతారని అంటారు. అమెరికా జనాభాలో చేసిన వైజ్ఞానిక సర్వేలను బట్టి సగం మంది ఇలాంటి నమ్మకాలు వెల్లడిస్తున్నారు. క్రైస్తవ శాఖలో ఈ నమ్మకాలు వివిధ రీతులుగా ఉన్నాయి.

- శామ్ హారిస్

Preview download free pdf of this Telugu book is available at Kraistavam Inta Amanushama