• Kothachoopu Abhivrudhi Velugu Needalu and other essays
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొత్తచూపు

    Kothachoopu Abhivrudhi Velugu Needalu and other essays

    Author:

    Pages: 295
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొత్తచూపు

ఆర్. ఎస్. రావు

భారత సామజిక సంబంధాలు, భూస్వామ్యం, సామ్రాజ్యవాదం, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్ర, ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం, పాలనావిధానాలు, భూసంస్కరణలు, ప్రజా సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ భావజాలం, అభివృద్ధి, విస్థాపన, పర్యావరణం, చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్ర , భారతీయ సామాజిక ఆర్థిక వ్యవస్థల సంక్షోభం, నక్సల్బరీ వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న చరిత్ర, సామ్యవాద ప్రయోగాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, పౌరహక్కుల ఉద్యమం, సామ్రాజ్యవాద ప్రభావానికీ కుల, మత వాదాలకు సంబంధం, స్త్రీవాదం వంటి అనేక అంశాల మీద మన కాలపు మార్క్సిస్టు ఆలోచనా, విశ్లేషణా, వివరణా సంవిధానానికి నిదర్శనాలు ఈ వ్యాసాలు.

మౌలికమైన సామాజిక సంబంధాల మార్పునూ, రాజ్యాధికారంలో ఉన్న వర్గాల స్వభావాన్ని అర్థం చేసుకునే చట్రం, అంటే భారత సమాజ వాస్తవికతను అర్థం చేసుకునే చట్రం, బహుశా ఆ వాస్తవికతను మార్చగలిగే ఆలోచనా - ఆచరణా చట్రం ఎవరి దగ్గర ఉంది? ఇంకా విజయం సాధించలేకపోయినా, ఇంకా ఒడిదుడుకులలో ఉన్నా, అది ఈ దేశ పీడిత ప్రజలు తమకు తాము ఇచ్చుకున్న నక్సల్బరీ పోరాట చట్రం మాత్రమేనని ఆర్. ఎస్. రావు గారు విస్పష్టంగా, సాధికారికంగా, సోదాహరణంగా ఈ వ్యాసాలలో నిరూపిస్తారు.

* * *

అర్థశాస్త్రవేత్తగా, గణాంక శాస్త్రవేత్తగా శిక్షణ పొందిన ఆర్. ఎస్. రావు గోఖలే ఇన్‍స్టిట్యూట్ (పుణె), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‍స్టిట్యూట్ (కలకత్తా)లలో పనిచేసి, సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం (బుర్లా, ఒడిషా) నుంచి ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసారు. మార్క్సియన్ విశ్లేషణా సంవిధానంతో భారత సామాజిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను, ఉత్పత్తి శక్తిగా ప్రజల ఆకాంక్షలనూ, ప్రత్యేకంగా నక్సల్బరీ పోరాట మార్గాన్ని విశ్లేషిస్తూ ఎన్నో రచనలు చేసారు. ఇప్పటికి వెలువడిన పుస్తకాలు ’ అభివృద్ధి వెలుగు నీడలు’ (1990), ’ టువర్డ్స్ అండర్‌స్టాండింగ్ సెమి ఫ్యూడల్ సెమి కలోనియల్ సొసైటీ’ (1995)

Preview download free pdf of this Telugu book is available at Kothachoopu Abhivrudhi Velugu Needalu and other essays