• Kopalle Hanumantha Rao Jeevita Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేశాభిమాని, విద్యాప్రదాత కోపల్లె హనుమంత రావు జీవిత చరిత్ర

    Kopalle Hanumantha Rao Jeevita Charitra

    Author:

    Pages: 167
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

శ్రీ కోపల్లె హనుమంతరావుగారి తీక్షణమగు బుద్ధి, గొప్ప నిస్వార్థ త్యాగము, నిష్కళంకమయిన దేశభక్తి మనం మరువలేనిది. త్యాగమూర్తులయిన వారిచే నిర్వహించ బడుతున్న ఈ విద్యాలయం బందరు పట్టణంలో ప్రతిష్టితం కావడం ఆంధ్రులెల్ల గర్వించదగ్గది. ఇందు గల బోధనా పద్ధతులవల్ల అంతటా తన తేజాన్ని ప్రసరింపజేయగల గొప్ప గుణవిశేషణాలు ఉన్నాయి

- మహాత్మాగాంధీ

బందరు త్రయమైన ముగ్గురూ నాకు పరిచయము. కళాశాల ప్రధానాచార్యులైన శ్రీ కోపల్లె హనుమంతరావుగారు ఆదర్శవంతులు, అందరికీ స్ఫూర్తిదాయకులు. ఈ కళాశాల మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ బాగా నిర్వహిస్తోందని ఆనందంగా చెప్పగలను.

- డా. సర్వేపల్లి రాధాకృష్ణ

హనుమంతరావు జీవితం యువకుల కాదర్శప్రాయము. ఈతని చరిత్రయే కళాశాలయొక్క చరిత్ర. కళాశాల చరిత్రయే ఈయన యొక్క చరిత్ర. జీవించిన 42 సంవత్సరములలోను యాతనికొక విశ్రాంతి క్షణమైనను లేదు. మనస్సునకు కలవరం అనేది లేనేలేదు. సేవయే ఈతని గమ్యస్థానం, ముందుకు సాగుటయే ఈతని లక్ష్యము.

- డా. పట్టాభి సీతారామయ్య

పట్టువదలని సంకల్పబలంతో, చల్లారని ఉత్సాహముతో పరిహాసము పాలయినను కోపము చెందలేదు. అగౌరవాలకు గురియైనా దిగులు చెందలేదు. లోభులను సయితం దానశీలురుగ చేసెను. విపక్షులను సుముఖులుగా మార్చగలిగెను. విశ్వాసమే వీరి విజయమునకు మూలము.

- ముట్నూరి కృష్ణారావు

* * *

దేశాభిమాని, విద్యాప్రదాత అయిన శ్రీ కోపల్లె హనుమంత రావు గారు జాతీయ కళాశాల వ్యవస్థాపకులు. వారి జీవిత కాలంలో వారి మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది.

మచిలీపట్టణంలో 1910లో వెలసిన తొలి జాతీయ విద్యా పరిషత్ కళాశాల. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈ విద్యాలయం. దేశాభిమానంతో ఆంగ్లేయుల విద్యా విధానం ఎదిరించటం కూడా దేశానికి స్వాతంత్ర్యం లభిస్తుందని పోరాడి తెలుగునాట ఏర్పాటు చేసిన వృత్తి విద్యాలయ సంస్థ ఇది.

వీరు చిన్న వయసులోనే (42) కాలం చేయటంతో వీరి ఆశయాలు కూడా పూర్తి సాఫల్యత చెందలేదు. శత వార్షికోత్సవం జరుపున్న ఈ కళాశాల వైభవం ప్రతి విద్యార్ధి తెలుసుకోవలసింది కళాశాల జీవిత చరిత్ర .

Preview download free pdf of this Telugu book is available at Kopalle Hanumantha Rao Jeevita Charitra