• Konni Kalalu Oka Swapnam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొన్ని కలలు ఒక స్వప్నం

    Konni Kalalu Oka Swapnam

    Pages: 173
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనుషులకి ఆశలుంటాయి... కోరికలుంటాయి... వాటిని నెరవేర్చుకోడానికి ప్రయత్నించిన వాళ్లందరూ విజయం సాధించలేరు. అవి నెరవేరకపోవడానికి పెద్దగా కారణాలేమీ ఉండకపోవచ్చు... ఒకటో రెండో కారణాలున్నా ఒక్కోసారి అవి సహేతుకంగా అనిపించకపోవచ్చు. బాధ్యతల బరువు ముందుకు సాగనివ్వకపోవచ్చు. చివరికి కొన్ని కలలు తీరకుండానే, జీవితం గడిచిపోతుంది. కొందరు మాత్రం బాధ్యతల బరువులు మోస్తూనే, తమ ఆశల మొలకలు వాడిపోకుండా జాగ్రత్త పడతారు. బరువులు మోస్తూనే తమ కలల్ని నెర వేర్చుకునే మార్గాలు వెతుక్కుంటారు. ఆ మార్గంలో నడిచి తమ కలలను నిజం చేసుకుంటారు. ఓ స్వప్నం సాకారమైతే కలిగే అనుభూతి వర్ణనాతీతం.
ఆ వ్యక్తి యాత్రికుడైతే... అతను కనే కల ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఓ యాత్ర అయితే... ఆ కల సాకారమైతే ఇక చెప్పేదేముంది? యాత్రికుడు భావుకుడవుతాడు, తన్మయుడవుతాడు. తన ఆనందాన్ని జ్ఞాపకాలలో దాచుకుంటాడు... అవి ఫొటోలు కావచ్చు, సావెనీర్లు కావచ్చు... ఆయా ప్రాంతాల పోస్ట్‌కార్డులు కావచ్చు... ఆ పరవశపు క్షణాల్ని నిలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఆ యాత్రికుడు రచయిత అయితే తన కలలను, ఆశలను, అనుభవాలను, అనుభూతులను చదువరులతో పంచుకుంటాడు. సమహృదయులను అక్షరయాత్ర చేయిస్తాడు. దాసరి అమరేంద్ర చేసిందదే! నలభై ఏళ్లుగా వెంటాడిన ఓ కలని నెరవేర్చుకుని... సాకారమైన స్వప్నాన్ని అక్షరబద్దం చేసి పారకులకు అందించారు.
స్కూటర్‌పై దక్షిణ భారతదేశ యాత్ర చేయాలన్న చిరకాలపు కోరికను 2015 జనవరిలో తీర్చుకున్న విధానాన్ని "కొన్ని కలలు ఒక స్వప్నం’ అనే యాత్రా రచనలో వివరిస్తారు దాసరి అమరేంద్ర. ‘ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు. ప్రకృతీ పరవశమూ మాత్రమే కాదు. మనుషులు… మనుషులు… మనలాంటి మనుషులు,’ అన్న ఎరుక అమరేంద్రది. ఆ రీతిలోనే సాగిన యాత్ర ఇది.

- కొల్లూరి సోమశంకర్

Preview download free pdf of this Telugu book is available at Konni Kalalu Oka Swapnam