• Konetilo Punnami Vennela - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కోనేటిలో పున్నమి వెన్నెల (free)

    Konetilo Punnami Vennela - free

    Pages: 251
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కుండపోత వర్షం వచ్చిన రోజున ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దానిని ఎవ్వరూ గమనించలేదు. ఒక్క కుమారి మాత్రం గమనించింది. రాగిణి దృశ్యం చూస్తూ తన లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా బయట తన చుట్టూ జరుగుతున్న విశాల ప్రకృతిలో మమేకమయింది.

ఆ దృశ్యమంతా ఉరికి వచ్చి రాగిణిలో ఒదిగిపోయినట్లయింది. అంతా నిశ్శబ్దంగా ఆమెలో దూరింది. ఒక చిత్సముద్రం రంగులు మారుస్తూ తనలో నిశ్శబ్దంగా, నీరవంగా, విస్ఫోటనంలా వివిధంగా ధారలా వచ్చి దాగిపోతున్నది.
మహా విస్ఫోటనం
చైతన్యం చిందులేసి బిందువులూ
విస్తృతంలో, బ్రహ్మాండంలో
అణువుల్లా పరమాణువుల్లా
ఎగిసి ఎగిరి చెదిరి
విస్తృతంగా చెదురుగా ఒదిగినయి.

మనస్సు స్తంభించినట్లయింది. ఒక్కక్షణంలో శూన్యం, నల్లటి వెన్నెలలా వుంది- ఒకసారి వెన్నెల నలుపంతా చీల్చుకుని వెలుగుచిందిస్తున్నట్లుంది. ఏది నిశ్చయంగా లేని స్థితి

మనసు బరువెక్కిందోన్నట్లు కుర్చీలోనే ఒరిగిపోయింది. యిదంతా కుమారి గమనిస్తున్నది. వెంటనే వచ్చి ఆమెను పట్టుకున్నది. తక్కిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసులో మునిగిపోయి ఏదో ధ్యానముద్రలో వున్నట్లు, ఆ దృశ్యం తమ దృష్టి ఏకమైనట్లు ఆ వాతావరణం మీద గీసిన చిత్రాల్లా వున్నారు.

ఎలా వచ్చిందో అలాగే వర్షం నిలిచిపోయింది. మేఘాలు విచ్చుకున్నాయి. ఆకాశం మళ్ళీ వెన్నెల వశమయింది. కుమారి మెల్లగా రాగిణిని లేపి రంగమంటపం వైపు నడిపించి మంటపంలోకి తీసుకెళ్ళి నటరాజ విగ్రహం ముందున్న పరుపు మీద పడుకోబెట్టింది. రాగిణి కళ్ళు అలానే మూతపడి వున్నాయి. కుమారి ప్రక్కన కూర్చున్నది. ఇలా రెండు మూడు గంటలున్న తరువాత రాగిణికి మెలకువ వచ్చినట్లయింది. లేచి కూర్చున్నది. ఆమెకు తన స్థితి ఏమిటో తెలియటం లేదు. జరిగిందేమీ గుర్తుకు రావటంలేదు. సమాధి స్థితినుండి మేలుకున్నట్లు విరుసుకున్న నేత్రాలతో నటరాజ విగ్రహాన్ని చూస్తూ కూర్చున్నది. ఇలా వుండగా కుమారి వెచ్చటి టీ తీసుకువచ్చి యిచ్చింది. దానినందుకుంటూ 'నా కేమయింది' కుమారీ అని అడిగింది.

“ఏమో గాని మీరు మాత్రం యీ ప్రపంచంలో లేనట్లు కుర్చీలో వాలిపోయారు. అన్నది.

రాగిణి దానికి జవాబివ్వలేదు.

నీవు వెళ్ళు కుమారీ, నీ పని చూసుకో” అని అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళి సోఫాలో వాలిపోయింది.