• Konda Meeda Atithi - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కొండ మీద అతిథి (free)

    Konda Meeda Atithi - free

    Publisher: Dr. P. Vijayasree

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిర్వికల్ప సంగీతం (1986), ఒంటరిచేలమధ్య ఒక్కత్తే మన అమ్మ (1995), పునర్యానం (2004), కోకిల ప్రవేశించే కాలం (2009), నీటిరంగుల చిత్రం (2014) తరువాత వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరిస్తున్న కవితా సంపుటి ఈ ‘కొండ మీద అతిథి, మరికొన్ని కవితలు’.

2014 నుంచి గత నాలుగేళ్లుగా రాస్తూ వచ్చిన ఈ కవితల్నిట్లా ఏరికూర్చుతూ కవి పూర్వకాలపు చైనా సామెతని ఒకదాన్ని తలచుకుంటున్నాడు. ‘చిన్నపాటి పరివ్రాజకుడు కొండల్లో తిరుగుతాడు, సర్వ సంగపరిత్యాగి నగరంలో జీవిస్తాడు’ అని. గత ఇరవయ్యేళ్ళుగా నగరంలో నివసిస్తూ ప్రాపంచిక పరాజయాన్ని అభ్యసించడమెట్లానో, పూర్తిపరివ్రాజకుడుగా జీవించడమెట్లానో - సాధన చేస్తూనే ఉన్నానని చెప్పుకుంటున్నాడు.

పరిత్యాగమంటే ప్రపంచాన్ని వదిలెయ్యడం కాదు, ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అంటిపెట్టుకుపోకుండా ఉండటమనే గుర్తుచేసుకుంటూ తనలోని అన్ని రకాల ఆధిపత్యవాసనల్ని నిర్మూలించుకునే క్రమంలోనే ఈ కవిత్వం రాస్తున్నాడని వివరిస్తున్నాడు. ఆ మెలకువతో ఈ సంపుటిని తన కవిత్వాన్ని ఇష్టపడే వారందరికీ కానుక చేస్తున్నాడు.