• Kiss Kiss Kill Kill
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కిస్ కిస్ కిల్ కిల్

    Kiss Kiss Kill Kill

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పనామా పొగ పీల్చి, పెద్ద రింగును సూటిగా సీలింగ్ మీద ఐరన్ రాడ్‌కు అమర్చి వున్న ఎఱ్ఱ బల్బు మీదికి వదిలాడు షాడో. సుడులు తిరుగుతూ బల్బును సమీపించింది రింగు. కిటికీలకు అమర్చిన కర్టెన్లను తోసుకొని కొండగాలి గదిలోకి ప్రవేశించటంతో చెదిరిపోయింది.

సిగరెట్ పీకను ఒక మూలకు విసిరి కొట్టి మంచం మీద లేచి కూర్చున్నాడు. పక్కనే టీపాయ్ మీద రెండు బీర్ సీసాలున్నాయి. ఒక సీసాను అందుకుని గ్లాసులోకి వంపుకున్నాడు. కింద పెట్టిన ప్లాస్క్‌లో నుంచి ఐస్ ముక్కలను తీసి గ్లాసులో వేశాడు.

గదికి ఒక చివరగా వున్న వాష్ బేసిన్ ముందు నిలబడి వుంది బిందు. ప్లాస్క్ తీసినప్పుడు వినవచ్చిన మోతను గమనించి వెనుతిరిగింది.

'ఛీర్స్....బిందూ, ఫర్ యువర్ హెల్త్' అంటూ గ్లాసు ఎత్తి నోటికి ఆనించుకున్నాడు షాడో.

కోపంగా చూసింది బిందూ. చేతిలో వున్న ప్లేటును బలంగా విసిరింది. గిర - గిరా తిరుగుతూ వస్తున్న ఆ ప్లేటు తలకు తగలకుండా తల వంచి ప్రాణాలు కాపాడుతున్నాడు షాడో. సూటిగా వచ్చి గ్లాసుకు తగిలింది ప్లేటు. పగిలిన గ్లాసు ముక్కలు పక్క మీద పడకముందే చేతిని విదిలించి, గ్లాసును ఆవతలకు విసిరేశాడు షాడో. అప్పటికీ చింది - అతని ముఖం మీదా, బెడ్ మీద పడింది బీరు. గదంతా ఆల్కాహాల్ వాసనతో నిండిపోయింది.

Preview download free pdf of this Telugu book is available at Kiss Kiss Kill Kill