• Kedaranath Yatra Jala Pralaya Beebhatsam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేదారినాథ్ యాత్ర - జల ప్రళయ బీభత్సం

    Kedaranath Yatra Jala Pralaya Beebhatsam

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇటీవల అనగా 2013 జూన్‌ 16,17వ తేదీలలో చార్‌ధామ్‌ యాత్రికుల మీద జరిగిన బీభత్సం, కేదార్‌నాథ్‌ వరదలలో కనీవినీ ఎరుగని, ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా నరకయాతన అనుభవించారు యాత్రికులు.

ఆ ప్రళయంలో బతికి ఢిల్లీ చేరిన యాత్రికుల ఆక్రందనలు మిన్నంటాయి. వారం రోజుల పాటు ఎక్కడున్నామో తెలియక, బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలే వాళ్ళ కళ్ళ ముందు భయానకంగా కదలాడాయి. శవాల గుట్టల మధ్య జీవచ్ఛవాల్లా గడిపిన రోజులే వారిని కలవరపెట్టాయి. వారి కష్టాలు వింటే ఎవరికైనా హృదయం ద్రవించక తప్పదు. సురక్షితంగా బయటపడేందుకు వారు పడిన యాతనలూ వర్ణనాతీతం. బస్సులు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోవడంతో పలువురికి కేవలం కట్టుబట్టలే మిగిలాయి. కళ్ళముందు జరిగిన విలయాన్ని తలచుకోవడానికి భయకంపితులవుతారు. స్నేహితులు, బంధువులు కొట్టుకుపోతుంటే చూడటం ఎంత భయానకంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. అంతేగాక నీళ్ళులేక, తిండిలేక, చలికి తట్టుకోలేక తమ వారు తమ పక్కనే కిందపడి చనిపోవడం ఎంత మనోవేదన కలిగిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

మానవుడు కష్టాల కడలిలో ఈదేటప్పుడు శరీరం సహకరించక పోయినా, తినను తిండి లేకపోయినా, తాగను నీరు లేకపోయిన తన ప్రాణం కాపాడుకోవడానికి , కష్టాల నుండి బయటపడడానికి మనిషికి కలిగే ధైర్యం, ఓర్పు, నమ్మకం, సంకల్పం ఎంత దృఢంగా ఉంటాయో కేధార్‌నాథ్‌ ప్రళయంలో బతికి బయటపడిన వారి అనుభవం వింటే ఎవరికైనా అర్ధమవుతుంది. అంతేగాక మానవులు చేసుకున్న పాపపుణ్యాల ఫలితమేమిటో కూడా తెలిసి వస్తుంది. ధనబలంతో, అధికార బలంతో, అహంకారంతో, వారు సాధించినవి, అనుభవించే వాటిని వారి తెలివితేటలు, సామర్ధ్యంతోనే అనుకునేవారు అది వట్టి భ్రమ అని తెలుసుకుంటారు. సృష్టినంతా ఒక అగోచరశక్తి నడిపిస్తుందని, జీవులందరిని ఆ శక్తే కాపాడుతుండని అర్ధమవుతుంది. మన పూర్యజన్మ ఫలితమే ఈ మానవజన్మ అనీ, ఇప్పుడు మనం అనుభవించే కష్టసుఖాలు, మనం మానవత్వంతో, దయాగుణంతో చేసే మంచి చెడ్డల ఫలితమే అని అర్ధం చేసుకుంటారు.

ఈ పుస్తకంలో వ్రాసిన కొన్ని సంఘటనలు మనసును కదిలింపజేస్తాయి. తన జీవితం గురించి, దేవుని గురించి, మంచి చెడ్డల గురించి ఆలోచింప జేస్తాయి. దైవ పూజలకన్నా, తీర్ధయాత్రకన్నా ఇతరులను కష్టాల్లో ఆదుకోవడము, ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చడం గొప్పవి, విలువైనవని ఆలోచిస్తారు.

ఈ పుస్తకం చదివిన వారిలో కొంతమందైనా మన జీవితగమ్యం, మానవత్వ విలువలు తెలుసుకొని సమాజానికి ఉపయోగంగా మారితే ఈ పుస్తకం వ్రాసిన ఉద్దేశం నెరవేరినట్లే. చార్‌ధామ్‌ యాత్రకు బయలుదేరే వారు ఈ పుస్తకం చదవగలిగితే యాత్రలో అవస్తలు పడకుండా అవగాహన ఉంటుంది.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Kedaranath Yatra Jala Pralaya Beebhatsam