• Kavitaa 49
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 49

    Kavitaa 49

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏటి ఒడ్డున


సాగిపోతున్న సెలయేటిపై
ఆగిపోయిన నా చూపుల్లోంచి
ఏవో భాష్యాలు జనిస్తున్నాయ్...
తనయందు కలకలం రేపినా
తన ముందు హాలాహలం రేగినా
కాలంలా కదిలిపోతూనే వుంది...
ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేక
కష్ట సుఖాల గట్ల నడుమ
జీవితంలా చలిస్తూనే వుంది...
నీళ్ళలో సగం దిగిన సూర్యబింబం
మానవ జీవనగమన ప్రతిబింబం
పరమార్థం అర్థం చేసుకోమంటుంది...
జరిగే సత్యాల్ని అలల భాషలో చెప్తూ
మరిగే బాధల్ని నురగలుగా చూపిస్తూ...
తీరం చేరాలని పరుగులు తీస్తోంది.
అందుకే నేస్తమా !
ఏటి ఒడ్డున నన్ను నేను మరుస్తుంటా
కోటి భావాలతో మూడోకన్ను తెరుస్తుంటా...

- బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 49