• Kavitaa 36
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 36

    Kavitaa 36

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పద్యాలు


పద్యాలు
చిన్న పిల్లల్లా దొర్లుతూ వుంటాయి
నా మీద బడి తొక్కుతూ వుంటాయి
అరుస్తాయి, ఆనందంతో కరుస్తాయి
నా చుట్టూ వృత్తాలు చుడుతూ
అల్లిబిల్లి తిరుగుతాయి, నన్ననుకరిస్తాయి
నా వేలు బట్టుకు నడుస్తానంటాయి
పద్యాలదేముంది, రమ్మంటే వస్తాయి
పొమ్మంటే పోతాయి,
బుల్లిబుల్లి చేతుల్తో కళ్ళు మూస్తాయి
కౌగిలించుకుంటాయి
ప్రేమ ముఖ్యంవాటికి
నువ్వు ప్రేమిస్తే, ఒళ్ళో వాలిపోతాయి
కసురుకుంటే దూరదూరంగా జరిగిపోతాయి
ఆత్మముఖ్యం వాటికి
నోటితో కాదు, హృదయంతో పలకరించు
పులకరించిపోతాయి
పువ్వుల్లా విచ్చుకుంటాయి
పిట్టల్లా లేచిపోతాయి
లేచి, దేశమంతటా వాలిపోతాయి.

- శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 36