• Kavita 2017
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవిత 2017

    Kavita 2017

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కవిత్వపు అస్థిత పరిభాషను పదేపదే సరికొత్తగా కనుగొనే క్రమంలో ఆ పలుకుబడి ఏ విధంగా అనేకానేక హొయల్ని వయ్యారాల్ని పలికిస్తున్నదో గమనిస్తూ 14 ఏళ్ళుగా 'కవిత' వార్షిక సంకలనాల ప్రస్థానం కొనసాగుతోంది. ఆ అక్షరాల సొగసునీ సోయగాల్ని చూస్తూ అబ్బురపడుతూ, ఆనందపడుతూ నిరంతరంగా 'మే' డే నాడు కవిత్వం పండుగ నిర్వహిస్తోంది. 14 ఏళ్ళ తరువాత కూడా తొలినాటి పసితనపు ఛాయలతోనే మెత్తటి హృదయాలుగల కవితల్ని ఒక పుస్తకంగా తీసుకువచ్చి 'కవిత 2017' గా మీముందు పెడుతున్నాం. ఏడాది పొడవునా భిన్నపోకడలు పోయిన కాలం కాలరుపట్టుకుని ఒకచోట కుదురుగా కూర్చోబెట్టటానికి ప్రయత్నం ఎప్పటిలానే చేశాం. కాలం నిండా కత్తిపోట్లు, ఇంకా కులం మోరెగరేసిన వూళ్ళు, తెలుగుబళ్ళను మూసేసిన జీవోలు, శవాల్ని సుదూరతీరాలకు మోసుకెళ్ళాల్సిన స్థితి, మత అసహనం లాంటి రకరకాల గాయాల బారినపడ్డ కాలం యొక్క దృశ్యాల్ని కవిత్వీకరించిన కవుల అంతరంగాల్ని ఆవిష్కరించిన పుస్తకం ఇది. భావాల్ని, భావనాబలాల్ని బేరీజువేస్తున్న తూనిక రాళ్ళని తోసిరాజని కొత్త వాక్యాలు నిర్మాణమౌతున్న సందర్భమిది. ఆ సందర్భాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నమే ఈ కవితా సంపుటి. రూపకీకరణకి భాష తన హద్దుల్ని సైతం చెరిపేస్తున్న కవిత్వ సంకలనాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.

- సాహితీమిత్రులు

Preview download free pdf of this Telugu book is available at Kavita 2017