• Kavita 2008
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవిత 2008

    Kavita 2008

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 158
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతీ ఏడాది, ఆ సంవత్సరం ప్రచురితమైన కవితల్లోంచి అత్యుత్తమ కవితలని ఎంచుకుని ఒక సంకలనంగా ప్రచురిస్తున్నారు సాహితీమిత్రులు. కాలానుకనుగుణంగా కవితలను పరిణామాల్లో అంశాలకు ఆవిర్భావ వికాసాలకు ఇవి దర్పణాలు. సంపాదకులు పాపినేని, దర్భశయనం వారి ప్రమాణాల మేరకు కవితల్ని ఎన్నిక జేయడం జరుగుతుంది.

ఈ పుస్తకం 2008లో ప్రచురితమైన కవితల్లోంచి ఏరిన 90 కవితలతో కూడిన సంకలనం. ఉత్తమ కవితలను ఒకేచోట ఆస్వాదించేందుకు ఈ పుస్తకం చదవాలి.

చివరి అట్ట మీది కవిత మీ కోసం

* * *

ఆపద!


మనకు కనిపించేంత చిన్నదిగా ఉండదు
ఆపద!
నిజానికి
ఎక్కడైతే అది కనిపించడం మానేస్తుందో
అక్కడే దాని ఆరంభం ఉంటుంది
అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో
సమయానికి దానిని గుర్తించడం కూడా
చాలా కష్టమైపోతుంది
అందరి అంగీకారంతోనే రాజ్యాంగం
అంతా నడుస్తోందని
మన ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే
అన్ని పనులూ అవుతున్నాయని
అనిపించినా
అగుపిస్తాయి కొన్ని సంకేతాలు
అక్కడక్కడా దీనికి భిన్నంగా
ఆ సంకేతాలు
ప్రమాదకరమైనవని నమ్మరు
చాలామంది
కానీ కవి
మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తునే ఉంటాడు
వీటి గురించి
ఎవరూ వినిపించుకోకపోయినా
అతను చెప్పేదాన్లో
కొత్త విషయం ఏమీ లేదని
అనుకున్నా
కవులెప్పుడూ పిచ్చివాళ్ళే అన్నా
హెచ్చరించడం మానడు అతడు
ఏదో ఒకనాడు
హఠాత్తుగా వీధి మలుపులో
ఒక వాహనమో, వ్యక్తో ఎదురుపడ్డట్టు
సాక్షాత్కరిస్తుంది
ఆపద!
అప్పుడు జనం కవి కోసం గాలిస్తారు
కానీ అప్పటికే అతను
ఖైదులోనన్నా ఉంటాడు
లేదా ప్రాణాలైనా కోల్పోయి ఉంటాడు!

మూలం: రాజేశ్ జోషి

అనువాదం: ఆర్. శాంతసుందరి

Preview download free pdf of this Telugu book is available at Kavita 2008