• Kathakruti 3
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథాకృతి మూడవ భాగం

    Kathakruti 3

    Author:

    Pages: 181
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అన్నం ఉడికిందీ, లేనిదీ తెలుసుకోవడానికి ఒక్క మెతుకుని పట్టుకుచూస్తే చాలంటారు. అలాగే ఓ రచయిత లేక రచయిత్రి సత్తా తెలుసుకోవడానికి ఓ కథానికని చదివితే చాలు! దానిని విశ్లేషిస్తూ - రచయిత(త్రి) ధోరణిని చెబుతూ - అతనికి లేక ఆమెకి కావలసిన సలహాలనివ్వడం - దానిని చదువుతున్న వాళ్ళకీ కేవలం ఆ రచయిత(త్రి) ధోరణి తెలియజేయడమే కాదు, కథానిక గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునేట్టు చెప్పడం విహారి గారికే తెలిసిన విద్య. అందుకే ఆయన-విమర్శకుడంటే చీల్చి చెండాడేవాడని కాకుండా, మంచి సలహాలనిచ్చే మిత్రుడని నిరూపించారు. 'కథాకృతి' సంకలనాలకి కథానికా సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. ఓ సద్విమర్శకుడన్నట్టు 'కథానికా రచయిత చీకటిలో కూడా తన దారిని తాను తీసుకోగలిగిన సృజనశీలి అయితే, విమర్శకుడు అతని వెంటే బాటరీలైటు వేసుకుని వెళ్తూ రచయిత(త్రి) వెళ్తున్న దారిని గుర్తించి చెప్పగలిగినవాడు. సరైన పంథాలో సాగేట్టు చూడగలిగినవాడు'. ఆ కోవకు చెందిన విహారి వంటి విమర్శకుల అవసరం నేటి తెలుగు కథానికకు ఎంతో ఉంది. మంచి విమర్శకులుంటే తప్పకుండా కథానికా భవిష్యత్తు ఇంకా బాగుంటుంది.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Kathakruti 3