• Katha Varshika 2010
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథావార్షిక 2010

    Katha Varshika 2010

    Author:

    Pages: 174
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

మంచి కథల ఆశయం మంచిని పెంచడమే అన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. కథలు చదివి మనమంతా మారిపోలేం. కాని ఒక కథ చదివింతర్వాత "ఆహా ఎంత మంచి కథ" అని ఒక క్షణకాలమేనా పాఠకుడు అలౌకిక తాదాత్మ్యానికి లోనయితే, ఆ కథ తన మహత్తరమైన ప్రయోజనాన్ని సాధించినట్లే.

ఏ రచయితా, ఏ ఆలోచనాపరుడు, ఏ మేధావి కూడా తన చుట్టూ వున్న, తన చుట్టూ జరుగుతున్న మార్పులకి అతీతంగా ఆలోచిస్తూ కూర్చోలేడు కదా! అయితే వర్తమానంలో వుంటూనే వర్తమానపు పరిమితులను అధిగమిస్తూ, ఇది అపూర్వము అనదగ్గ ఒక సన్నివేశాన్ని ఎన్నుకుంటాడు మంచి కథా రచయిత. మంచి కథ తయారవ్వాలంటే, ఒక అపూర్వమైన సంఘటన నిశ్చయంగా ఉండాలి. అయితే, సామాన్యమైన సంఘటన ద్వారా మంచి కథ రాదా? వస్తుంది - రాదని కాదు. కానీ సామాన్యమైన సంఘటనని, అపూర్వ సంఘటనగా తీర్చిదిద్దగలిగే ఆల్కెమీ - మహా కౌశలం - రచయితకి వుండాలి. అనూహ్యమైన సంఘటనేనా - చాతుర్యం లేని రచయిత చేతిలో ఉత్త పనికిరాని కథగా తయారయి కూర్చుంటుంది.

మంచి కథలు సాధారణంగా ఓపెన్ ఎండెడ్ స్టోరీస్‌గా ఉంటాయి. ముగింపు చెప్పడు రచయిత. పాఠకుల విచక్షణకి వదిలిపెట్టేస్తాడు. దీనివల్ల పాఠకులకు గొప్ప ఆనందం కలుగుతుంది. ఏమి జరిగివుంటుందో మన ఊహకి వదిలిపెట్టేడు రచయిత అనుకుంటారు రసజ్ఞులైన పాఠకులు. ఈ విధంగా పాఠకుడ్ని ఆలోచించే దిశలోకి తీసుకువెళ్ళగలిగిన కథలు నిశ్చయంగా మంచి కథలు.

- ఎ.వి.రెడ్డిశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Katha Varshika 2010