• Katha Nandanam
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 480
    480
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథానందనం

    Katha Nandanam

    Author:

    Pages: 614
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘తెలుగు కథనం’ పేరుతో లోగడ నేను సంకలన పరిచిన పుస్తకం ఏభై కథలతో పదిమంది రచయితల, రచయిత్రుల భాగస్వామ్యంతో వెలువడితే, ఈ 'కథానందనం' వంద కథలతో, ఇరవై మంది రచయిత్రులు, రచయితల కథా సాహిత్యంతో, మేలు కథల కలయికగా వెలువడుతోన్న మరో మంచి పుస్తకం.

కథానందనంలో ఉన్న నూరు కథలూ నూరు అనుభవాల సారాంశంతో రూపుదిద్దుకున్నవి... మానవ సంబందాలే అంతస్సూత్రంగా రచించబడినవి... కథావస్తువు ఏదైనా గాని, ఎవరికి తోచిన పద్ధతిలో, స్వయం సిద్ధమైన ఒరవడిలో తీర్చిదిద్దిన శిల్పాలివి. శీలా ఏర్రాజు గారన్నట్లు రచయిత శిల్పి అయితే వస్తువు బండరాయి. లోకంలో బండరాళ్ళకి ఎలా కొరత లేదో వస్తువుకి కూడా కొరతలేదు. మనిషి జీవితం నిండా అవే. మనిషి జీవితమే ఒక గొలుసు. సంఘటనల గొలుసు. అయితే ప్రతీ రాయి శిల్పానికి పనికి రాదు. అలాగే ప్రతి సంఘటనా కూడా. కొండా, కోనా తిరిగి ఉలిపెట్టి, తట్టిచూసి పరీక్ష చేసి తగిన రాయిని శిల్పి ఏరుకున్నట్లే రచయిత కూడా అనువైన వస్తువుని ఎన్నుకోవాలి. పైకి డంబంగా వున్నా లోపల ఏమీ లేని గుల్లయితే శ్రమే తప్ప పలితం సున్నా. ఒకవేళ రచయిత కష్టపడి కథను తయారు చేసినా ఏ విమర్శకుడో కాస్త గట్టిగా ఓ రాయి విసిరే సరికి పుటుక్కున పగిలి పోతుంది. అలాంటి పరీక్షకు ఈ కథలన్నీ సిద్దంగా ఉన్నాయి. ప్రశంసిస్తారో, పగుల గొడతారో మీ పఠనానుభవం తర్వాత తేట తెల్లమవుతుంది.

- డా. ఎం.వి.జె.భువనేశ్వరరావు (భువన్)

గమనిక: " కథానందనం " ఈబుక్ సైజు 18.8mb

Preview download free pdf of this Telugu book is available at Katha Nandanam