-
-
కపర్ది
Kapardi
Author: Kolhapur Ramamurthy
Publisher: Self Published on Kinige
Pages: 489Language: Telugu
పెట్రోలియం నిల్వలకన్నా వేగంగా భూగోళం మీది మంచినీటి నిల్వల తరగిపోతున్నా గమనించలేని ప్రమత్తత ఆధునిక సమాజాన్ని ఆవరించిన సమయంలో, ఓ వైపు, పర్యావరణానికి తీరని హాని జరుగుతున్నా, ఏటా లక్షల ఎకరాల పంటభూమి నిస్సారంగా మారిపోతున్నా, పట్టించుకోకుండా, ప్రగతికీ, వాపుకూ తేడా తెలుసుకోలేని దురవస్థలో పడున్న పాలనావ్యవస్థ!
మరోవైపు, చరిత్రలో కనీ, వినీ, ఎరుగని కొత్తవ్యూహంతో దాడిచేసి, మన దేశాన్ని కోలుకోలేని దెబ్బతీయాలనే పగతో పావులు కదుపుతున్న శతృవులు!
హిమాలయాల్లో ఎక్కడో దాగిన ఓ ప్రాచీనమందిరాన్ని, పాకిస్తాన్ గూఢచార సంస్థ, ఐ.ఎస్.ఐ రహస్యంగా వెదికిస్తోంది. అదే సమయంలో, గతానికీ, భవిష్యత్తుకీ సేతువుగా నిలిచిన ఓ రహస్య ఉద్యమం తిరిగి జాగృతమైంది, .... శతాబ్దాల ప్రత్యర్థులమధ్య, మృత్యుచదరంగం తిరిగి మొదలైంది!
అనూహ్యంగా అందులో పావుగా మారిన ఓ సిబిఐ ఆఫీసర్, తన అస్థిత్వాన్ని తానే సందేహించుకుని, ప్రశ్నల వలయంలో చిక్కుకున్నపుడు, .... విద్వేష్యం, పగ, అజ్ఞానం, స్వార్థం, అహంకారాల కారణంగా, ఓ మహావిపత్తు చుట్టుముట్టబోయే ఆ సమయంలో, ఏం జరిగింది!?....
చదవండి, సైన్స్, సనాతన విజ్ఞానం, చరిత్ర, త్రివేణీసంగమంగా కలసిసాగే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్, కపర్ది.
