-
-
కపాల దుర్గం (రివైజ్డ్ ఎడిషన్)
Kapala Durgam Revised Edition
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 96Language: Telugu
Description
ఆ సమయంలో ఆ అడవి దారిలోంచి లీలగా ఎవరిదో ఏడుపు వినిపిస్తున్నది. అది విని ఉలిక్కిపడ్డాడు చిత్రాంగదుడు. “మిత్రమా! ఇదేదో దెయ్యాల గోలలా వున్నది” అన్నాడు తడబడుతూ.
అమరసింహుడు నిబ్బరంగా ముందుకి నడిచాడు. చిత్రాంగుడి మాటలాగే అతడి పాదాలు కూడా తడబడుతున్నాయి. చెట్ల తీగలను, వూడలను తప్పించుకొని నడిచేకొద్దీ ఏడుపు ఇంకా పెద్దగా వినిపిస్తున్నది.
చిత్రాంగుడు ఠక్కున ఆగిపోయాడు. అది గమనించి అతడివైపు చూశాడు అమరసింహుడు. ఏం చెప్పాలో తెలియక మూగ సైగలు చేశాడు చిత్రాంగుడు. “నేనున్నాను కదా! భయపడకు మిత్రమా!” అంటూ అతడి భుజం తట్టాడు.
పాఠకులను వాయు మనో వేగాలతో పరుగులు తీయించే అమరసింహుడి సాహసయాత్ర .
Preview download free pdf of this Telugu book is available at Kapala Durgam Revised Edition
Login to add a comment
Subscribe to latest comments
