• Kanti Rekhalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాంతిరేఖలు

    Kanti Rekhalu

    Publisher: Navodaya Publishers

    Pages: 218
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''అయితే శ్రీనివాస్‌ చచ్చిపోయాడా జంగయ్యా?''

''అబ్బే... నాకేం తెలియదు... నిజం నాకేం తెలియదు'' తడబడ్డాడు.

''అంత తడబాటు దేనికి? నాకు నిజం చెప్పు జంగయ్యా''

''నాకేం తెలియదు బాబూ!''

''ఆ మఠంలో మకాం వెయ్యి. విషయాలు తెలుస్తాయి'' అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండ రాజేంద్ర పరుగెత్తుకు వచ్చాడు.

''బాలరాజును పోలీసులు పట్టుకున్నారు-'' ఒగరుస్తూ చెప్పాడు.

జంగయ్య గుండెలు బాదుకుంటూ వెళ్ళాడు.

సిద్ధార్థకు కాస్త క్లూ దొరికినందుకే ఎంతో ఆనందంగా వుంది.

'కడుపుకోత' అన్నమాట అతన్ని పుండులా సలుపుతోంది. శ్రీనివాస్‌ మరణిస్తే ఆ తల్లికి మరే ఆధారం లేదు. తమ యింటి కాంపౌండులో అడుగుపెట్టి, ఆశ్చర్యంగా మేడమీదికి చూచాడు. కిటికీ దగ్గర శ్వేత నిలబడి వున్నది.

''కనిపించిన ఆడదల్లా మీ కబంధ హస్తాలలో బందీ అవుతుందని అనుకోవటం పొరపాటు-'' శ్వేత గొంతు అది.

''నువ్వు గట్టిగా అరిస్తే యెవరో సహాయానికి వస్తారని నీ ఆశ. కాని ఈ కాంపౌండు దాటి వచ్చేది నా కుటుంబ సభ్యులే'' అన్నాడు పురుషోత్తమరావు.

* * *

పాఠకులకు ఉత్కంఠ కలిగిస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల ఇది.

Preview download free pdf of this Telugu book is available at Kanti Rekhalu