• Kandukuri Veeresalingam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కందుకూరి వీరేశలింగం

    Kandukuri Veeresalingam

    Publisher: Victory Publishers

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత శతాబ్దంలో పుట్టి, ప్రజాబాహుళ్యం మేలు కోసం తమ ధన, మాన ప్రాణాలను కూడా తృణప్రాయంగా త్యజించటానికి ఏ మాత్రం వెనుకాడకుండా, పదిమంది మేలే తమకు జరిగే మేలుగా భావించినవారు ఎందరో మహానుభావులు. వారి భవిష్యద్దర్శనం వలన, చేసిన నిస్వార్థ సేవల వలన ఈనాడు మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా మనగలుగుతున్నాము. భారతజాతి అంతా వారికి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలదు?

అయితే మనకు స్వాతంత్య్రం సిద్ధించి అర్థనూట పదహారు సంవత్సరాలు దాటింది. దేశం దాస్య శృంఖలాలలో అనుభవించిన కష్టాలను క్రమంగా మరచిపోయే కాలం వస్తున్నది. మన భావితరాల వారికి ఆ సౌజన్యమూర్తులు చేసిన సేవలు, వారు అనుసరించిన వ్యక్తిత్వం, తమదైన వారి శీలాన్ని పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందువలన భావి భారత పౌరులైన నేటి విద్యార్థులు నాటి మహానుభావుల అసమాన త్యాగాలను గుర్తించి వారి గుణగణాలచే ఉత్తేజితులు కావటం ఒకటైతే, ఆ మార్గంలో ప్రవర్తించటానికి అవసరమైన ప్రేరణతో దేశ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ లభ్యమై ప్రపంచంలోని సౌభాగ్యవంతమైన దేశాలలో మన దేశం ఒకటిగా నిలబెట్టగలిగే ప్రేరణ పొందుతారనేది ఇంకొకటి మేము ఆశిస్తున్న ప్రయోజనము. అందుకే ఒక సిరీస్‌గా అనేకమంది జాతి నిర్మాతల జీవితాలను విద్యార్థులకు పరిచయం చేయాలనుకొని ఈ ప్రచురణలను తీసుకొని వస్తున్నాము.

పాఠశాలలు, కళాశాలలో చదువుతూ కిశోరప్రాయం (ఎడలిసెన్సు)లో ఉన్న విద్యార్ధినీ విద్యార్థులను ఈ పుస్తకాలు సరియైున మార్గంలో ప్రభావితులను చేయగలవని మా ఆకాంక్ష.

ఈ పుస్తకంలో శ్రీ కందుకూరి వీరేశలింగం గారి జీవితం, తెలుగు జాతికి వారు చేసిన సేవలు తెలియజేయడమైనది.

ఈ మహోన్నత లక్ష్యంలో మేము ఏ మాత్రం కృతకృత్యులము కాగలిగినా మా ఆశయం నెరవేరినట్లే.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Kandukuri Veeresalingam