• Kalyana Manjeeralu
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళ్యాణ మంజీరాలు

    Kalyana Manjeeralu

    Author:

    Pages: 187
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉత్తర భారతదేశంలో సంస్కృత సాహిత్యానికి సమ ఉజ్జీగా దక్షిణదిన తమిళ సాహిత్యం విలసిల్లింది. అందులో ఇలంగో రాకుమారుడు రచించిన ‘శిలప్పదిగారం’ అనే కావ్యం చాలా ప్రసిద్ధమయింది. దీని రచనాకాలం క్రీ.శ. 3వ శతాబ్ది ప్రారంభంగా విమర్శకులు గుర్తించారు. కథా ప్రాంతం దక్షిణ భారతంలో పశ్చిమతీరం. ఆ కాలంలో దక్షిణాదిన హిందూ, జైన, బౌద్ధమతాలు సహజీవనం సాగించినై. ఆ కాలపు కళలను, మతాన్ని, జన జీవితాన్ని నాగరికతను ‘శిలప్పదిగారం’ ప్రతిబింబించింది. ‘శిలప్పదిగారం’ అంటే ‘కళ్యాణ మంజీరాలు’ అనే అర్థం.

అసమ సాంఘికవ్యవస్థ కొన్ని వర్గాల ప్రజలను సాంఘికమైన అన్యాయాలకు ఎట్లా గురిచేసిందీ, అందులో స్త్రీకి జరిగిన అన్యాయాన్ని ఈ నవల చాలా సున్నితంగా చిత్రించింది. అంతేకాదు ఎదిరించి పోరాడటమే గౌరవప్రదమన్న సందేశాన్ని మాధవి ద్వారా ఈ నవల అందిస్తుంది. ఆ కాలపు సాంఘిక పరిస్థితుల పరిధిలోనే అమృత్‌లాల్ నాగర్ ఎంతో నిపుణతో ఈ చిత్రణ చేశారు. ఆ కాలపు నాగరికతా, వాతావరణం చెడకుండా తన సందేశాన్నందించిన అమృత్‌లాల్ నాగర్ ప్రశంసనీయులు. ఈ నవలను ‘కళ్యాణ మంజీరాలు’గా అందెల రవళుల సందడి వినిపించే చక్కటి తెలుగు వచనంగా మలచిన కౌముదిగారు అభినందనీయులు. ‘కళంకిని’ అనే పేరుతో మొదట అచ్చయింది. అయితే ‘కళ్యాణ మంజీరాలు’ అనే పేరే దీనికి బాగా సరిపోతుందని ఈ ముద్రణలో ఈ పేరు ఎన్నుకున్నాం.

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Kalyana Manjeeralu