• Kalam Techchina Marpu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాలం తెచ్చిన మార్పు

    Kalam Techchina Marpu

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథల సంపుటికి ఏ పేరు పెట్టాలా అని అనేక రకాలుగా ఆలోచించాను. ఏదో ఒక కథ పేరు మొత్తం కథల సంపుటికి వర్తించేదిగా చూసి పేరు పెడుతుంటారు. అలా ఆలోచించి ఈ సంపుటికి 'కాలం తెచ్చిన మార్పు' అనే పేరు పెట్టాలనిపించింది. ఈ పేరు అన్ని కథలకు సరిపోతుందని భావిస్తున్నాను. పల్లెనుండి విశాల విశ్వందాకా ఈ కథల్లోని కథావస్తువు.

రచయిత తాను చూసింది, గమనించింది, తనకు తెలిసింది రాయడంతోపాటు, తెలియనిది తెలుసుకొని రాస్తారు. తనకు తెలిసిన విషయాలు, తెలుసుకునే క్రమంలో జరిగే పరిణామాలు రచయిత జీవితంలో, ఆలోచనల్లో ప్రభావం వేస్తాయి. తద్వారా జీవితంలో భాగమవుతాయి. రచయిత జీవితంలోని సంఘటనలు, స్పందనలు, సంఘర్షణలు, తనకెదురైన సన్నివేశాలు కథల్లో, నవలల్లో చిత్రిస్తారు. వాటికి కల్పనను, కథా స్వరూప స్వభావాలను జోడిస్తాు. అలా చూసినప్పుడు తన చుట్టూతా ఉన్న సమాజాన్ని చిత్రించడమే రచయిత అనుకోకుండా చేసే పని.

తెలిసిందంతా కథలో చెప్పడం సాధ్యం కాదు. తెలిసింది, తెలుసుకున్నది, ఊహించింది కథలో చెప్పకుండా ఉండటం కూడా సాధ్యం కాదు. ఈ సంఘర్షణ, వైరుధ్యం, రచయితలు ఎవరికి వారు పరిష్కరించుకోవాలి. నాకు సాధ్యమైన పద్ధతిలో నేను దీన్ని పరిష్కరించుకున్నాను. అలా రూపొందిన కథలే ఇవి. ఈ కథలు నిర్దిష్ట స్థల కాలాలు, సంస్కృతి కేంద్రంగా పల్లెనుండి విశాల విశ్వందాకా సార్వజనీనంగా సాగుతున్న గతం తర్వాతి చరిత్రకు సాక్ష్యాలు. క్రితం తర్వాత సాగుతున్న మానవ సంబంధాల పరిణామాలు.

- బి. ఎస్. రాములు

Preview download free pdf of this Telugu book is available at Kalam Techchina Marpu