• Kalala Sagu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలల సాగు

    Kalala Sagu

    Publisher: Poetry Forum

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కలల సాగు



రెప్పల దొన్నెల్లో అలల అలికిడి
దివారాత్రుల అనుభవాల సలపరింత.
నిదురతెరకింద రెక్కలు విప్పిన సింగిడి

దృశ్యాలను మోసి అలసిన కనుపాపల మీద
అమ్మ ఓదార్పులా నింగి నీడ.


చెట్ల గొంతుల్లో శ్రావ్యంగా మేఘమల్హర
జాలి లేక తరలిపోయిన ఋతుపవనాలు
నర్తిస్తూ వెనుకకు రానీ.


చెరువుల ఒడిపట్టిన నేలదేహం మీద
వెన్నెల వర్షం కురువనీ.


పట్టనీ...
పూలగుండెలు విప్పారినట్టు
దోసిళ్లు పట్టనీ...


దయలేక దాటిపోయిన నదులు
దరులొరుసుకుంటూ పారనీ...


ఇన్నాళ్లూ కన్నీళ్ల స్నానం చేసిన
గత వర్తమానాలు భవిష్యత్తు కోసం
పసిడి కలల పన్నీటి స్నానాలు చేయనీ...


దుక్కం తప్ప దుక్కి దున్నే ఆశలేక
బీడు పడ్డ హృదయక్షేత్రం మీద
ఊహలకు ఊపిరిపోస్తూ,
మనసు మూలల్లో ఆశయాలు విత్తనీ.


కదలనీ
నాగేటిసాళ్ల గానాల ధ్యానంలో సాగు.


రహస్తంత్రులమీద
రాగాలు పురుడు పోసుకుంటున్నట్టు
‘కల’వరింతలకు కవనయోగం సిద్ధించనీ


కలలన్నీ బతుకు పాటల
పల్లవులై ప్రతిధ్వనించనీ...


కాయంమీద సానబట్టుకునే కర్తవ్యాలై
యోగ్యతను చాటనీ...
ఆకాంక్షల మునుంపట్టి
మెలకువల భుజమ్మీద బాధ్యతై సాగనీ...

- సాక్షి సాహిత్యం

26 మే 2008

Preview download free pdf of this Telugu book is available at Kalala Sagu