• Kalagantine Cheli
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలగంటినే చెలీ!

    Kalagantine Cheli

    Pages: 254
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సినిమా తెరల జిలుగులు వాస్తవంగా అలా వుండవని, అదంతా టెక్నిక్ చేసే మాయాజాలమని ఎంతమందికి తెలుసు? అమ్మాయిలూ అంతే. తనకు కాబోయేవాడు నాగార్జునలానో, చిరంజీవిలానో వుండాలనుకుంటారు. అందరిలోనూ కొద్దో గొప్పో వుండే ఈ పిచ్చి గంగాధరంలో ఇంకాస్త ముదిరింది. అంతే తేడా.

మంగళ వాయిద్యాలు చెవిన పడడంతో ఆమె ఆలోచనల లింకు తెగింది.

వాళ్ళు శివాలయం ఆవరణలోకి అడుగుపెట్టారు. ఆ శివాలయం దాదాపు పదెకరాల స్థలంలో వుంది. గురుస్వామి అనే ఆయన చందాలు పోగుచేసి ఎంతో కష్టపడి ఆ గుడి కట్టించాడు. అందులోని నందీశ్వరుడే చిన్న దేవాలయమంత వుంటాడు.

ఇక లింగాకారంలో వున్న శివుడు పెద్ద దేవాలయం ముందుండే ధ్వజస్తంభంలా వుంటాడు.

వాళ్ళు వెళ్ళేసరికి భోజనాల సన్నాహాలు జరుగుతున్నాయి. తక్కువమందిని పిలిచినట్టున్నారు. యాభైమందిదాకా వుంటారంతే.

రఘురామయ్య ఎదురొచ్చి ఎంతో అభిమానంతో చంద్రరేఖను ఆహ్వానించాడు.

ఆమె వెళ్ళి ఓ సిమెంట్ బల్లమీద కూర్చుంది.

అంతలో "హలో అక్కా! బావున్నావా? కనపడడం లేదు" అంటూ అక్కడికి వచ్చింది ప్రవీణ.

"బావున్నాను. నువ్వే కనపడడం లేదు" అని కూర్చోమన్నట్లు సైగ చేసింది.