• Kala Enduku
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళ ఎందుకు?

    Kala Enduku

    Author:

    Pages: 175
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అమ్మా! నీ పాట వినాలని కట్టు బట్టలతో బయల్దేరి వచ్చేశాను. నువ్వు లేక ఈ నెల్లాళ్ళకే ఇల్లంతా ఎడారిలా అయి పోయింది" అన్నాడు.

తండ్రి మాటలు విన్న కళ తల దించుకుంది.

"ఒక్క సారి వీణ వాయించు తల్లీ! నువ్వు పాడుతోంటే వినాలని ఎంతో కోరికగా వుంది"

"నాన్నా!" కళ మొహమంతా కళావిహీనమై పోయింది. కన్నీళ్ళు కళ్ళలో చోటు లేక చెక్కిళ్ళ మీదుగా ధారలు కట్టాయి. గద్గదిక మౌతున్న గొంతు పెకిలించుకు కొంటూ అంది - "ఈ ఇంట్లో అడుగు పెట్టాక నా వీణ ఎలా ఉందో నేను చూడ లేదు నాన్నా!"

తెల్లబోయాడు బలరామయ్య. "అదేమిటమ్మా! వీణ ఏమైంది?"

కళ ఆవేదనా స్వరంతో చెప్పింది. "నన్ను మేనా లోంచి దింపి ఈ గదిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టారు నాన్నా! అప్పుడు సిగ్గుతో వీణ గురించి నే నేమీ అడగలేదు. తర్వాత తెలిసింది, వీణ పెట్టిని సామాను గదిలో పెట్టించారని. నే నింత వరకూ వీణ తీసి చూడ లేదు."

బలరామయ్య అయోమయంగా కూతుర్ని చూశాడు. "నువ్వయినా వీణ పెట్టి తెప్పించి నీ గదిలో పెట్టుకోవచ్చుగా అమ్మా?"

కళ నిస్తేజంగా నవ్వింది. " నే నంత ధైర్యం చెయ్యలేక పోయాను నాన్నా! నేను వీణ వాయించడం అత్తయ్య గారికి ఇష్టం లేదని తెలిసింది."

బలరామయ్య మ్రాన్పడి పోయాడు. ఎంతో సేపటికి శాంతంగా, "నీకు సంగీతం నేర్పించింది మీ అత్తగారి కోసం కాదమ్మా! నీ కోసం. నిన్ను పొందగలిగే అదృష్టవంతుడి కోసం. అపర సరస్వతిలా నువ్వు వీణ వాయిస్తొంటే నా అల్లుడు సంతోషంతో పరవశిస్తాడని."

"నాన్నా!" తండ్రి వాగ్ధోరణికి అడ్డు పడుతూ మధుర స్మృతులన్నీ మాయమయ్యే నిజాన్ని వెల్లడించింది కళ.

"వారికి కూడా ఇష్టం లేదు నాన్నా! నేను వీణ వాయిస్తానని తెలిసి కూడా ఎన్నడు వినాలని కుతూహల పడలేదు. ఒక్క పాటైనా పాడమని అడగలేదు. వీణ తెచ్చి ఈ గదిలో ఉంచు కుంటానని నేనే అడిగితే ఆయన ఒప్పుకోలేదు. 'మా అమ్మ చెప్పినట్టు నడుచుకో బాలా!' అన్నారు నాన్నా!" - కళ, దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నించకుండా వెక్కి వెక్కి ఏడ్చేసింది.

Preview download free pdf of this Telugu book is available at Kala Enduku