• Kadiledi Kadilinchedi
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కదిలేదీ... కదిలించేదీ...

    Kadiledi Kadilinchedi

    Pages: 380
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎబికె - తెలుగువారి 'అమర్త్యసేన్'

"కదిలించే పాత్రికేయ ఇంధనం ఎబికె ప్రసాద్. చిత్రకారుడు కుంచెతో బొమ్మల ప్రపంచాన్ని నిర్మించినట్టు, శిల్పి ఉలితో ఘనీభవించిన రాళ్ళకు ద్రవీభవించే జీవనాకృతుల్ని పొదిగినట్లు - సామాజిక సెలయేళ్ళకు, రాజకీయ ప్రవాహాలకు, ఆర్థిక పరవళ్ళకు ఆనకట్టలుకట్టి ప్రజల హృదయ క్షేత్రాలను, బుద్ధిజీవుల నల్లరేగడి భూములలోకి తనవైన బీజాక్షరాలతో, వాక్యవిన్యాసాలతో, పదబంధాలతో యాభైయ్యేళ్ళకు పైగా పాత్రికేయ పంటల్ని పండించిన ప్రజల మనిషి ఎబికె.

ఎబికె పాత్రికేయ పుత్రుడు. ఒక సృజన సుతుడు కూడా. ఆయన వృద్ధాశ్రమంలో పసిహృదయంతో జీవించడానికి ప్రధాన కారణం ఇప్పటికీ ఆయనలో బాల్యం భద్రంగా ఉండడమే. పరిపక్వ సునిశితత్వం, ప్రపంచాన్ని పసికట్టే మనస్తత్వం, చరిత్రలో మరుగున పడిపోతున్న మానవీయత ఆయన అభరణాలు. ఆత్మాభిమానం, నిబద్ధత, నిమగ్నత పాత్రికేయ ప్రపంచంలో ఆయన పదిలపరుచుకున్న అపూర్వమైన సంపద ఆయన్ని అజేయుణ్ణి చేసింది. ఆయన 'తెలుగువాళ్ళ అమర్త్యసేన్' . జాతీయ, రాష్ట్రీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సమస్యలెన్నింటి పైనో వేలాది వ్యాస పరంపర ద్వారా పలు సంపాదకీయ సంపుటాలు, 'నిబద్ధాక్షరి' పేరిట సాహిత్యకీయాల సంపుటాలు, మరెన్నో అంశాలపై విశ్లేషణలు, విమర్శలతో కూడిన సమాచార గనుల ద్వారా యువతరాన్ని ఉత్తేజపరిచిన సంపాదకుడు ఎబికె. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పురస్కారం సహా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు వరించిన వరేణ్యుడు. తెలుగు భాషా నిఘంటువులకు ఎక్కవలసిన ఆయనవైన పదాలు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలను మేల్కొలిపే గుణం, కదిలించే శక్తి, నడిపించే సాహసం, పరిపూర్ణపు బతుకు కోసం పాటుపడే తపన ఉన్న పాత్రికేయ నక్షత్రం ఎబికె.

- డా. నాళేశ్వరం శంకరం

Preview download free pdf of this Telugu book is available at Kadiledi Kadilinchedi