-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
జ్యోతిశ్శాస్త్ర వైభవమ్ (free)
Jyotissastra Vaibhavam - free
Author: Multiple Authors
Publisher: Marumamula Venkataramana Sarma
Pages: 184Language: Telugu
మన బంగారు తెలంగాణ రాష్ట్రం సుప్రసిద్ధ పంచాంగ కర్తలైన సిద్ధాంతులకు, జ్యోతిష పండితులకు ఆలవాలం. పూర్వం అనేక సంస్థానాలకు ఆస్థాన పండితులుగా పేరెన్నికగన్నవారెందరో వున్నారు. ఇతర రాష్ట్రాల్లోనే గాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన వారు ఈ రాష్ట్రంలో నుండుట మన అదృష్టం. వారి పరంపరలోనే ప్రస్తుతం అనుభవజ్ఞులైన సిద్ధాంతులు, జ్యోతిష పండితులు విశేష కృషి చేస్తున్నారు. మరికొందరు యువపండితులు సిద్ధాంతులు క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ప్రభుత్వ సహకారంతో, మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సౌజన్యంతో శ్రీ గాయత్రీ పీఠము, జ్యోతిర్మయ మహాపీఠము, దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు నిర్వహించుట విశేషం. రాష్ట్రంలోని సిద్ధాంతులను, జ్యోతిష పండితులందరిని ఒకే వేదిక మీదకు తీసుకు రావాలన్న సదుద్దేశ్యంతో ప్రారంభమైన జ్యోతిష సభలు దిగ్విజయంగా జరిగినవి. ఇందులో నేను స్వయంగా పాల్గొనుట కూడా జరిగింది. మొదటిరోజు జరిగిన సిద్ధాంతసదస్సులో 12 అంశాలపై, రెండవ రోజు జాతక సదస్సులో 12 అంశాలపై అనుభవజ్ఞులైన సిద్ధాంతులు జ్యోతిష పండితుల ప్రసంగాలు అద్భుతంగా వున్నవి. ఇదిగాక మొదటిరోజు సాయంత్రం తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య సహకారంతో నిర్వహించిన విద్వత్సభలో రాబోవు శ్రీ విళంబి నామ సంIIర పండుగల నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించి, ప్రభుత్వానికి సమర్పించి, శాశ్వతంగా తెలంగాణ విద్వత్సభను ఏర్పాటు చేసుకోవడం అత్యంత ప్రధానమైన విషయం. భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు లేకుండా తగు చర్య గైకొన్నందులకు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తున్నాను.
రెండవ రోజు జరిగిన సమాపనోత్సవంలో 'నవగ్రహ అనుగ్రహం' అను జ్యోతిష రూపక ప్రదర్శన వినూత్నంగా, విశేషంగా అందరిని ఆకర్షితులను చేసింది. దీనిద్వారా ఎన్నో శాస్త్ర సంబంధ విషయాలు ప్రజలు తెలుసుకోగలిగారు.
మా సూచనల మేరకు సభల్లో జరిగిన ప్రసంగ పాఠాలను భావితరాల వారికి ఉపయుక్తమగుటకుగాను గ్రంథస్థం చేయాలనే సత్సంకల్పంతో ముందుకు రావడం విశేషం. 'జ్యోతిశ్శాస్త్ర వైభవమ్' అను ప్రత్యేక సంచిక జ్యోతిష పండితులకేగాక. శాస్త్రాభిమానులకు, ఆసక్తిగలవారందరికి సద్వినియోగపడగలదని ఆశిస్తున్నాను. జ్యోతిష విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్త గ్రంథం కాగలదని ఆకాంక్షిస్తున్నాను....!
- డా. కె.వి. రమణాచారి
గమనిక: " జ్యోతిశ్శాస్త్ర వైభవమ్ " ఈబుక్ సైజు 11.4mb
- FREE
- ₹324
- ₹324
- ₹324
- ₹270.00