• Julius Fucik
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జూలియస్ ఫ్యూజిక్

    Julius Fucik

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చెకోస్లోవేకియా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, పాత్రికేయునిగా, సాంస్కృతిక ఉద్యమ సారధిగా, అన్నింటికి మించి ఫాసిస్టు వ్యతిరేక యోధునిగా జూలియస్ ఫ్యూజిక్ నిర్వహించిన పాత్రకు అక్షరరూపమే పత్రికా రచయిత, సాహిత్య ఉద్యమనేత ఉషా ఎస్ డానీ 32 సంవత్సరాల క్రితం రాసిన జూలియస్ ఫ్యూజిక్ అనే చిరుపొత్తం.

ఆశయబలం, ఆచరణ, లక్ష్యశుద్ధి తొణికిసలాడుతున్న తన యవ్వనదశలో డానీ రాసిన జూలియస్ ఫ్యూజిక్ కథనం - రచయిత మాటల్లో చెప్పాలంటే, తామర తుంపరగా సమాచారం అందుతున్న నేటి అంతర్జాల యుగంలో - ఉద్వేగం తగ్గిన అతని యాభైలలో పునర్ముద్రణకు వచ్చింది.

రచయిత, సాహిత్య ఉద్యమ కార్యకర్తగా డానీలో వచ్చిన పరిణామ మేమైనప్పటికి, అతని భావ పరిణామం, ఉద్వేగ తీవ్రతలో గత ముప్ఫై రెండు సంవత్సరాలుగా వచ్చిన మార్పులు ఏమున్నప్పటికీ, సవరించిన జూలియస్ ఫ్యూజిక్ పునుర్ముద్రణ - పాఠకలోకం ముందు నేటికీ ఒక కర్తవ్యాన్ని ఘంటాపథంగా నిలుపుతుందన్న భావనతో - సాహితీమిత్రులు, విజయవాడ ప్రచురణగా దీనిని మీ ముందుంచుతున్నాం.

- ఎన్. అంజయ్య
సంపాదకుడు, సాహితీమిత్రులు

* * *

అమరత్వం

విత్తనం చనిపోతూ
పంటను వాగ్దానం చేసింది.
చిన్నారిపువ్వు రాలిపోతూ
చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది.
అడవి దహించుకుపోతూ దవానలాన్ని వాగ్దానం చేసింది.
సూర్యస్తమయం చేతిలో చెయివేసి
సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది.
అమరత్వం రమణీయ మయింది!
అది కాలాన్ని కౌగిలించుకొని
మరోప్రపంచాన్ని వాగ్దానం చేసింది.

- శివసాగర్
(మే, 1985)

Preview download free pdf of this Telugu book is available at Julius Fucik