• Jillellamudi Amma Bommala Katha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • జిల్లెళ్ళమూడి అమ్మ బొమ్మల కథ

    Jillellamudi Amma Bommala Katha

    Author:

    Publisher: Marumamula Rukmini

    Pages: 42
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమ్మ మనందరికీ కనిపించే, కని పెంచే దైవం!

దైవం అమ్మగా వస్తే! ఆ కథే మీరు బొమ్మలు చూస్తూ, చదువుకోబోతున్న అమ్మ బొమ్మల కథ!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా! మహాత్ములు బాల్యంలోనే తమ ప్రతిభను, ప్రేమను, కరుణను, దయను, శక్తిని అనేక సందర్భాలలొ ప్రదర్శిస్తారు. ఆశ్చర్యంగా అనిపించినా అవన్నీ నిజాలు. మనం ఇతరుల పట్ల ఎంత మర్యాదగా, దయగా, ప్రేమగా వుండాలో నేర్పే విధంగా వుంటాయో, వారి మాటలు, చేతలు!

ఆంధ్రపదేశ్‌లో, గుంటూరు జిల్లా బాపట్ల తాలుకాలో వున్న చిన్న గ్రామం జిల్లెళ్లమూడి. ఆ గ్రామ కరణం శ్రీ బ్రహ్మాడం నాగేశ్వరరావు గారు. ఆయన భార్య పేరు అనసూయ. ఆమె బాల్యమే మనం చదువుతున్న బొమ్మల కథ నిండా వున్నది. ప్రతి సందర్భం, సంఘటన, సన్నివేశం మనకు అనసూయ బాల్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

ఆ అనసూయమ్మే పెరుగుతూ, పెద్దదవుతూ, తన దివ్యత్వాన్ని ప్రదర్శిస్తూ, అందరినీ ఆదరిస్తూ, లోకంచేత జిల్లెళ్ళమూడి అమ్మగా పూజలందుకున్నది. తన చిన్ననాడే మనుషుల పట్ల, జంతువుల పట్ల, పక్షుల పట్ల, దయను చూపించింది, ప్రేమను పంచింది.

కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరణతో చూసింది. అన్ని విషయాలను ప్రశ్నించింది. సమాధానాలను సరిదిద్ది సత్యాన్ని చాటిచెప్పింది. మానవత్వం గురించి మాట్లాడుతునే, మనిషి మనిషిగా బ్రతకాలని బోధించింది.

ఆడపిల్ల అణుకువగా వుంటూనే ఆత్మశక్తిని కలిగి వుండాలని చెప్పింది.

జిల్లెళ్ళమూడి అమ్మ బాల్యం ఈనాటి బాలబాలికలకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. మంచితనాన్ని, త్యాగాన్ని నేర్పుతుంది. అందరితో కలిసి జీవించడం ఎట్లాగో చూపించి, సంస్కృతిని, సంస్కారాన్ని ఆచరించడం ఎట్లాగో తెలియజేస్తుంది.

మార్చి 28,1923న జన్మించిన అమ్మ, జూన్ 12, 1985న దేహం వదిలిపెట్టి, జిల్లెళ్ళమూడి అమ్మగా చరిత్రలో నిలిచింది! అమ్మకు జేజేలు!

- వి. యస్. ఆర్. మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Jillellamudi Amma Bommala Katha