• Jeevitham Oka Varam Seth Vignanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితం ఒక వరం (సేత్ విజ్ఞానం)

    Jeevitham Oka Varam Seth Vignanam

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భూమి మీద ఈ జీవితం ఒక గొప్పవరం! మనిషి తన జీవితంలో అన్ని కోణాలలో అభివృద్ధి చెందడానికి, చైతన్య పరిణామం చెందడానికి, ప్రతిక్షణమూ ఆనందంతో ఆస్వాదిస్తూ జ్ఞాన విస్తరణను కావించుకోవడనికి సర్వశక్తి సామర్థ్యాలను తనలో ఇముడ్చుకుని జన్మ తీసుకోవడం జరిగింది.

ఈ మహామూల ప్రకృతిలో అన్ని జీవాత్మలూ ఎంతో విశిష్టతనూ పారమార్థికతను కలిగివుంటున్నాయి. ప్రకృతి పట్ల అపారమైన నమ్మకంతో జీవించడం అలవాటు చేసుకోవడం అత్యంతావశ్యకం! కీటకజాతి, వృక్షజాతి, పక్షిజాతి ...ఇంకా అన్ని జీవజాతులూ ఈ ప్రకృతిపైన అపారమైన నమ్మకాన్ని కలిగి వుంటూ జీవచైతన్య పరిణామాన్ని పొందుతున్నాయి. సూర్యరశ్మి కోసమో, లేదా వర్షం కోసమో ఏ జంతువూ లేదా ఏ పక్షీ లేదా ఏ కీటకమూ భిక్షాటన చేయడం లేదు. వాటికి కావాల్సిన అన్నింటినీ ఈ మహాప్రకృతి సమకూరుస్తున్నది. జీవితాన్ని బహుముఖ కోణాలలో చైతన్య పరిణామం చెందించనికి కావలసిన అన్ని వనరులనూ ఈ ప్రకృతి సమకూరుస్తున్నది. ఏ జీవాత్మ కూడ భయాందోళనలు లేకుండా జీవిత ప్రవాహాన్ని కొనసాగించడనికి అవసరమయ్యే సమస్త సంపదలను+సమస్త సౌకర్యాలను+సమస్త వనరులను ఈ ప్రకృతి ప్రసాదిస్తూన్నది.

ఈ ప్రకృతిలో ఏ జీవాత్మ కూడా భయాందోళనలకు గురి కాకుండా జీవ చైతన్య పరిణామాన్ని చెందించుకోగలుగుతున్నపుడు మనిషి దిగులు పడాల్సిన అవసరం ఏముంది? ప్రతి రోజూ సంపూర్తి ఆనందంతో జీవితానుభవాలను పొందుతూ చైతన్య పరిణామం చెందడం కోసమే మీరు జన్మ తీసుకోవడం జరుగుతూంది. Life is a gift (and not a curse). You are a unique, worthy creature in the natural world -జీవితం ఒక గొప్ప వరం! ఈ మహామూల ప్రకృతితో నిండిన ఈ ప్రపంచంలో మీరు ఎంతో విశిష్టమైన జీవాత్మగా ఎంచబడుతున్నారు. మీ చైతన్య పరిణామం (evolution of consciousness) సాటిలేనిది; అసామాన్యమైనది. మీ చైతన్య పరిణామం అన్ని జీవజాతుల చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా ఈ ప్రపంచం యొక్క సమిష్టి చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Jeevitham Oka Varam Seth Vignanam