• Jeevitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితం

    Jeevitham

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఇదీ జీవితం' అని చెబ్తారు చలపాక ప్రకాష్‌ తమ పద్నాలుగు కథానికల సంపుటి 'జీవితం'లో. మొత్తం కథానికల్ని రెండు విభాగాలుగా మనకి అందించారు. వాటిలో మొదటి విభాగం జీవితానికి బొమ్మలాంటిది. జీవితంలో వివిధ కోణాల్ని, సమస్యల్ని సీరియస్‌గా చిత్రించారు. రెండవ కోణంలో ఈ సమస్యల్ని సులభంగా తట్టుకొని నిలబడటానికి అవసరమైనటువంటి మనోవికాశాన్ని కలిగించిన కథానికలు రెండవ భాగం. ఇలా విభజించటం కూడ చాలా బాగుంది. ఈ సంపుటిలోని కథానికలలో అధిక భాగం రచయితకి వ్యంగ్య చిత్రణ పట్ల వున్న మక్కువని మనకి చెప్పకనే చెబుతాయి. ఈ కథానికలలోని హాస్యం వెనుక ఒక బాధ ధ్వనిస్తుంది, ధిక్కార స్వరంతో.

ఆధునిక జీవితం మీద సంధించిన ఈ విమర్శనాస్త్రాలు మన పెదవుల మీద చిరునవ్వులు చిందింపచేయడమే కాదు, వీపు మీద చరిచి ప్రశ్నల్ని సంధిస్తాయి. ఆ ప్రశ్నలకి సమాధానాల్ని మనందరం వ్యక్తిగతంగా, ఉమ్మడిగా కూడా ఆలోచించాల్సి నవసరముంది.

కథానిక ప్రధాన లక్షణం, క్లుప్తత, స్పష్టత. అవి పుష్కలంగా ఉన్నాయి చలపాక ప్రకాష్‌ కథానికల్లో. అలాగే కథానికా ప్రారంభం ఉపోద్ఘాతాలు, వర్ణనలు లేకుండా సరాసరి కథలోకి వెళ్ళడం కూడా ఈ కథానికల్లో కనిపిస్తుంది. ముగింపు సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేదే కాకుండా ఆలోచింపచేసేది కూడా కావడం గమనార్హం. ఇంతకు ముందు కవిత్వంలో తన ప్రతిధ్వని చాటుకున్న చలపాక ప్రకాష్‌ ఈ కథానికా సంపుటితో తనలో వున్న మంచి రచయితని మనముందుంచుతాడు.

- డా॥ వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Jeevitham