• Jashuva
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాషువా

    Jashuva

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భవిష్యత్తు మీద ఆశ, పురోగమన దృష్టి, సామాజికాభివృద్ధి పట్ల తత్పరత గల కవి జీవితం, సాహిత్యాలలో పెద్దగా తేడా ఉండదు. జాషువా ఈ కోవకి చెందినవాడు. ఆయన తన నుండి సమాజాన్ని ఎన్నడూ విడిగా భావించలేదు. వాస్తవానికి జాషువా సామాజిక నిబద్ధత గల కవి. అందుకే సమాజంలోని హెచ్చుతగులను పరిశీలించి, దానికి గల కారణాలను అనేక కోణాలలో పరిశీలించాడు. ఈ భావనలే ఆయన కవిత్వంలో కన్పిస్తాయి.

ఆ మధ్యకాలంలో సాహిత్యంలో తలెత్తిన కొత్త శాఖ మానవతావాదం. వ్యక్తి స్వేచ్ఛను శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావితం చేసి మానవతావాదం మనుష్యుల మధ్య కన్పించని సంకెళ్ళను తొలగించడానికి తోడ్పడింది. మనుష్యుల మధ్య గల అంతరాలు తొలగి, సమానత్వం రావాలన్న భావనను ప్రేరేపించింది. ఇక్కడ మానవతా వాదానికి హేతువాదం బలాన్ని ఇచ్చింది. సహేతుకమైన విజ్ఞానం మానవునిలో ఒక ఆశాజనకమైన మార్పుని తెస్తుంది. జాషువా కవిత్వం, వ్యక్తిత్వంలో ఈ మానవత స్పష్టంగా కన్పిస్తుంది.

బుద్ధి తెలిసిన నాటి నుంచి తాను చూస్తున్న సమాజంలో రోజు రోజుకీ పెరుగుతున్న దుష్పరిణామాలు జాషువాను కలతపెట్టాయి. సమాధానాలు లేని, దొరకని ప్రశ్నలతో చికాకు పెట్టాయి. మనిషిలో స్వతహాగా మార్పువస్తే గానీ అమలు జరుపలేని ప్రయత్నాలవన్నీ. కాని మనస్వియైన వ్యక్తిగా, సామాజిక నిబద్ధత గల కవిగా జాషువా తన ప్రయత్నాలేవీ ఆపలేదు. సాటి మనుష్యులలో మానవీయతని తట్టి లేపడానికి జీవితాంతం కృషి చేశాడు. నిజానికి ఆనాటి జాషువా వేసిన ప్రశ్నలన్నీ నేటికీ సమాధానం కోసం ఎదురుచూస్తునే ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Jashuva