-
-
జానపద గేయాలు
Janapada Geyalu
Author: Vidwan Dastagiri
Language: Telugu
దస్తగిరి గారు సేకరించిన 91 జానపద గేయాలలో, అలాగే ఏల పదాలలో సుదీర్ఘ కథాగేయాలలో కనిపించే జానపదుల శ్రామిక, జీవన మాధుర్యం, పురుషాధిపత్యం, ఆర్ధిక పరతంత్రత గల స్త్రీ జీవితం, ఇంటిలో బయట మానవ సంబంధాలు, పురాణ కథలను ఐతిహ్యాలను వారు చెప్పుకునే తీరు, వారి కాల్పనిక చాతుర్యం, ఊహావైచిత్రి మనల్ని అబ్బురపరుస్తాయి. ఇలాగే ఫాక్షన్ గొడవలు, చావులు, కులవిద్వేషాలు, మూఢవిశ్వాసాలు మనల్ని ఆలోజింపజేస్తాయి .
భూమిని, శ్రమని నమ్ముకున్న ఉన్నత మానవులు జానపదులు. భూమిని, శ్రమని అమ్ముకుంటూ, అంతా డబ్బుగా మార్చుకుంటూ విశ్వవిపణి వీధిలో ఈనాడు మానవుడే ఒక వస్తువు అయిపోయినాడు. ఫలితంగా కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చిన మానవ సంబంధాలు, తత్త్వచింతన, భావన, కూర్పు, నేర్పు, ఆత్మవిశ్వాసంతో కూడిన మానసిక దృతి, గ్రామీణ జీవితంలో కూడా మాయమవుతున్నాయి. ఈ నేపధ్యంలో రాబోయే తరాలవారికి ఒకప్పటి జనజీవితం ఎలా ఉండేదో? యాస, పలుకుబడి ఎలా వుండేవో చూపించగల "విజ్ఞాన సర్వస్వాలు" ఈ గేయాలు.
- ఆచార్య హెచ్. ఎస్. బ్రహ్మానంద
తిరుపతి
