• Jailu Godala Madhya Hero Suman
  • Ebook Hide Help
    ₹ 72
    120
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జైలు గోడల మధ్య హీరో సుమన్

    Jailu Godala Madhya Hero Suman

    Author:

    Pages: 119
    Language: Telugu
    Rating
    4.84 Star Rating: Recommended
    4.84 Star Rating: Recommended
    4.84 Star Rating: Recommended
    4.84 Star Rating: Recommended
    4.84 Star Rating: Recommended
    '4.84/5' From 25 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 15 premium votes.
Description

ఎప్పుడో పాతికేళ్ల క్రితం కథనం..ఇప్పుడెందుకు? జైలు గోడల మధ్య హీరో సుమన్ గడిపిన జీవితం ఎందుకు అవసరం?
జైలు గోడల మధ్య అతను పడ్డ తపన…నేర్చుకున్న జీవిత సత్యాలు.అతని మనో నిబ్బరం..తను నిర్దోషిని అనే నమ్మకం…
ఒక వ్యక్తిత్వ వికాసానికి కావలిసిన అంశాలు, ఒక పాపులర్ నటుడి స్వీయ అనుభవాలు చేదు నిజాలు,నిష్టుర సత్యాలు…
ఇప్పటి తరానికీ అవసరమయ్యే ఎన్నో విషయాలు…
ఈ ఇన్వెస్టిగేటివ్ సీరియల్ రాయడానికి అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు పెట్టిన షరతు ఏమిటి? సుమన్‌ని ఎలా ఒప్పించడం జరిగింది?
ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?
సూపర్ హిట్స్ బిజీగా వున్న హీరో…క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్…షూటింగ్‌లో అలిసిపోయి ఇంటికి వచ్చాక ఓ రాత్రి తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే పోలీసులు. ”మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు”
ప్రపంచం తలక్రిందులు అవ్వడమంటే ఏమిటి?
ఒక హీరోను పోలీస్‌లు అరెస్ట్ చేయడమేమిటి?
తప్పు చేయకున్నా ఆరునెలలు జైలుగోడల మధ్య గడపడం ఏమిటి..?
లైట్స్ కెమెరా యాక్షన్‌ల మధ్య గడిపే హీరో జైలులో ఎలా వున్నాడు?
ఆంధ్రభూమిలో 1991 లో 24వారాలపాటు సీరియల్‌గా వచ్చి సంచలనం సృష్టించిన
ఫ్లాష్ బ్యాక్
జైలు గోడలమధ్య హీరో సుమన్
అసలు ఆ రోజు ఏం జరిగింది?
ప్రముఖరచయిత విజయార్కె
పరిశోధనాత్మక కథనం
ఫ్లాష్ బ్యాక్
జైలు గోడలమధ్య హీరో సుమన్
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Jailu Godala Madhya Hero Suman
Comment(s) ...

జైలుగోడల మధ్య హీరో సుమన్ సీరియల్ ఆంధ్రభూమిలో వస్తున్నప్పుడు ఒక సంచలనం.ప్రతీవారం ఎదురుచూసేదానిని...అప్పుడు క్యూరియాసిటీ తో చదివేదానిని.ఆ సీరియల్ గురించి చర్చించుకునేవాళ్ళం.సుమన్ తో గెస్ట్ గా ఒకరోజు షూటింగ్ లో గడిపే అవకాశం కోసం ( ఆరోజు షూటింగ్ మొత్తం చూసి సుమన్ గారితో కలిసి లంచ్ చేయడం ఆంధ్రభూమి పాఠకులకు మరుపురానిరోజు..అప్పట్లో అది ఒక కొత్త ప్రయోగం...) జైలులో సుమన్ గడిపిన రోజులను సంఘటనలను తలుచుకుని కంటతడి పెట్టుకునేవాళ్ళం..ఆ పుస్తకం అప్పట్లో మాకు దొరకలేదు.ఇన్నాళ్ల తరువాత e బుక్ రూపంలో మాకు దొరికింది.ఒక వ్యక్తిత్వవికాస పుస్తకంలో వున్న ఎన్నో విషయాలు సుమన్ గారి జైలు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు.థాంక్యూ విజయార్కె గారు...థాంక్యూ సుమన్ గారూ థాంక్యూ కినిగె ..
విజయార్కె గారు తెలుగు పత్రికల్లో మీ రచనలకు అభిమానిని..మీ గుడ్ ఫాదర్ మరణశాసనం...మేన్ రోబో, క్యూ .నాకు చాలా ఇష్టమైన నవలలు...షర్మిల ప్రహేళిక ఆముక్తమాల్యద ,సాకేత్,అగ్నిహోత్ర,సిద్దార్థ పాత్రలు అంటే మరీ ఇష్టం .
కన్నడంలో అనువదించబడిన మీ పుస్తకాలకు కూడా ఫ్యాన్ ని...ఎందుకంటే నాకు కొద్దిగా కన్నడం చదవడం వచ్చు..నా ఫ్రెండ్ చదివి మరీ వినిపించేది.

"జైలుగోడల మధ్య హీరో సుమన్" ఒక స్టార్ హీరో ఎలా పరిస్థితుల మధ్య చిక్కుకుపోయింది..ఎలా పోరాడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.ఆంధ్రభూమి వీక్లీ లో అప్పుడు సంచలనం సృష్టించింది.ఈ పుస్తకం వ్యక్తిత్వవికాసకోణంలో చూస్తే వ్యక్తిత్వవికాస పుస్తకంలా అనిపిస్తుంది.
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం నిర్దోషిగా బయటకు రావడం ...వెనుక వున్న నేపథ్యం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.

ఒకవ్యక్తి ఎదుగుదల వెనుక ఎన్నో క్రీనీడలు వెన్నంటి ఉంటాయి.అతని ఎదుగుదలను అడ్డుకోవాలని..చూసారో...యాదృశ్చికమో...పథకం ప్రకారం జరిగిందో ఇప్పటికీ మిస్టరీగానే అనిపిస్తుంది.హీరో సుమన్ ఒకప్పుడు స్టార్ డం అంచులు చూసారు.నేటిభారతం..సితార ,ఇద్దరుకిలాడీలు ,తరంగిణి లాంటి సినిమాలు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు.
తరువాత బావాబావమరిది ,పెద్దింటి అల్లుడు కలెక్టర్ గారి అల్లుడు ...
ఆపై అన్నమయ్య లాంటి సినిమాలు...శివాజీ లాంటి ప్రతినాయక పాత్రలు. విజయవంతమైన చిత్రాల హీరో ,మంచి అందగాడు మంచినటుడు..జైలుగోడల మధ్య గడిపిన జీవితాన్ని ఆంధ్రభూమిలో పాతికేళ్ల క్రితమే చదివునపుడు షాకయ్యాం.ఇప్పుడు మాలీ చదువుతుంటే " ఒక వ్యక్తిత్వవికాస పుస్తకం " లో వుండవలిసిన ఎన్నో అధ్యాయాలు పాఠాలు ఆయన జీవితంలో అనుభవాలుగా మిగిలాయి.అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కున్న మీకు హేట్సాప్ సుమన్ జీ..
సుమన్ జీవితాన్ని బయో పిక్ గా తీయవచ్చు.ఈ పుస్తకాన్ని రాసిన విజయార్కె గారికి .కినిగె కు ధన్యవాదాలు .

ఒక్కోసారి ఎంత గొప్పవాళ్ళైనా కష్టాలపాలు కాక తప్పదు అనడానికి హీరో సుమన్ జీవితం ఒక ఉదాహరణ.అయితే నిర్థోషిగా జైలుగోడల మధ్య గడపడం( విచారణ సమయంలో రిమాండ్ లో )విచారకరం.తన మీద పడ్డ నిందను తొలిగించుకుని చీకటి నిందను చీల్చుకుని వెలుగులోకి వచ్చాడు సుమన్.అతను నిర్థోషి అని న్యాయస్థానం తేల్చిచెప్పింది.ఆ స్వామి వారి కృప నిజాయితీ ఈ రెండు ఉండడం వల్లే అన్నమయ్యలో శ్రీవేంకటేశ్వరుడి పాత్రను పోషించే భాగ్యం కలిగింది కాబోలు.
ఆంధ్రభూమిలో పాతికేళ్ల క్రితం సీరియల్ గా వచ్చినప్పుడు ..ఈ సీరియల్ ద్వారా మొత్తం ప్రపంచానికి మరోసారి సుమన్ నిర్థోషి అని తెలిసింది.జైలులో గడిపిన జీవితం సుమన్ లో ఎంతో మార్పు తెచ్చిందని ఈ పుస్తకం ద్వారా అర్థం అయ్యింది.తనను తాను మరింత దృఢంగా మార్చుకున్నాడు.ఖైదీలు కూడా సుమన్ ను గౌరవించడం సుమన్ వ్యక్తిత్వానికి నిదర్శనం.వ్యక్తిత్వపు విలువలు జీవితాన్ని ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.

జైలుగోడల మధ్య హీరో సుమన్...ఒక వ్యక్తిత్వవికాస పుస్తకానికి ఏమాత్రం తీసిపోనిది.ఒక పాపులర్ హీరో అనుకోకుండా జైలుగోడల మధ్య గడపవలిసి వచ్చినప్పుడు గుండె నిబ్బరాన్ని కోల్పోకుండా నిలబడడం గొప్ప విషయం.సుమన్ గారి నిర్థోషిత్వానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది.ఇలాంటి పుస్తకాలు రాయడం..జరిగిన విషాదాన్ని పాస్తాకుల హృదయాలకు హత్తుకునేలా రాసిన విజయార్కె గారు ,బోల్డ్ గా తన జీవితంలో ( జైలుగోడల మధ్య) జరిగిన విషయాలను చెప్పిన సుమన్ గారు ఈ పుస్తకానికి నిజమైన హీరోలు.

జైలుగోడల మధ్య హీరో సుమన్ పుస్తకము చదివాకా నాలో కొంత పాజిటివ్ మార్పు వచ్చింది.." నా సమస్యే చాలా పెద్దది,..నేనే కష్టాలు పడుతున్నాను " అనే భ్రమలో నుంచి బయత్యకు వచ్చా..అంత పెద్ద స్టార్ " సుమన్ గారి నేటిభారతం,తరంగిణి సితార సినిమాలు వచ్చిన సమయంలో నేను చాలా చిన్న...అంత గొప్ప స్టార్ కూడా నిందను భరించాడు.కానీ ఆత్మవిశ్వాసంతో నిర్దోషిగా బయటకువచ్చాడు .ఒక వ్యక్తిత్వవికాస పుస్తకాన్ని ఒక థ్రిల్లర్ నవలను చదువుతున్నట్టు అనిపించింది .థాంక్యూ విజయార్కె గారూ.థాంక్యూ సుమన్ జీ..థాంక్యూ కినిగె.

ఒక పాపులర్ సినిమా హీరోకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? కంటతడి పెట్టించింది.జైలులో అమ్మ గురించి ఆలోచిస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేచిన సుమన్ లో తల్లిని గొప్పగా ప్రేమించే కొడుకు కనిపించదు.చాలా విలువైన విషయాలను నుభవాలను తెలియజేసి కొత్త బ్రతుకు పాఠాలను కళ్ళముందు నిలబెట్టిన పుస్తకం.ప్రతీచిన్న విషయానికి నిరాశతో కూరుకుపోయే ప్రతీఒక్కరూ చదువవలసిన పుస్తకం.

అద్భుతమైన పుస్తకం.చిన్నసమస్యలకే చావే మార్గం అనుకునేవారికి ఈ పుస్తకం ఎన్నో విషయాలను నేర్పుతుంది.ఒక మంచి బయోపిక్ తీయాదానికి సరిపడా జీవితం వుంది ఈ పుస్తకంలో.
దాదాపు ఇరవై ఏడేళ్ల క్రిందట ఆంధ్రభూమి వీక్లీ లో ఈ సీరియల్ చదివాను.ఇప్పుడు ఒకేసారి చదివే అవకాశం వచ్చింది.థాంక్స్ టు కినిగె...
ఒక పేరున్న స్టార్ జీవితంలో జరిగిన ఈ సంఘటన క్రైమ్ సీరియల్ ను తలపించింది.
అర్థరాత్రి అరెస్ట్,కన్నతల్లి ఫీలింగ్స్,
ఏసీ లో యాక్షన్ కట్స్ మధ్య బిజీగా వుండే హీరో ఒకేసారి జైలుగోడల మధ్య గడుపవలిసి రావడం విచారకరం.
సుమన్ నిజజీవితంలో కూడా హీరోగా వున్నారు.జైలు నుంచి నిర్థోషిగా బయటకు వచ్చారు.
ఇలాంటి కథలు బయోపిక్స్ గా రావలిసిన అవసరం వుంది.
హేట్సాప్ సుమన్ గారూ ..
విజయార్కె గారు రాసిన ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది.

కళ్ళముందు జరిగినట్టు వుంది.ఒక బయో పిక్ చూస్తున్నట్టు వుంది.జైలుగోడల మధ్య ఒక స్టార్ హీరో ఉండడం ఊహించడమే కష్టం.
వివాదాలకు దూరంగా వుండే సుమన్ మీద బ్లూ ఫిలిమ్స్ నీలి ( అసత్య ) వార్తలు చదివిన వారికీ నిజమెంతో నిగ్గు తేల్చి చెప్పిన పరిశోధనాత్మక ధారావాహిక " జైలుగోడల మధ్య హీరో సుమన్ " ఆంధ్రభూమి వీక్లీ లో పాతికేళ్ల క్రిందటే చదివాను.
" సుమన్ తో ఒకరోజు షూటింగ్ లో గడిపి ,వారితో కలిసి లంచ్ చేసే కొత్త ప్రయోగం " ఆంధ్రభూమి చేసినప్పుడు సుమన్ గారిని,సీరియల్
( పుస్తకరచయిత ) రచయిత విజయార్కె గారిని కలిసివాళ్లలో నేనూ వున్నాను.
ఈ పుస్తకం నాకు వ్యక్తిత్వవికాసరచనలా అనిపిస్తుంది.ధైర్యం చెబుతుంది.సత్యమేవ జయతే ..అన్న నిజం చెబుతుంది.
ఇప్పుడు కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులోకి రావడం సంతోషకరం.

సెన్సేషన్ ని సొమ్ము చేసుకున్న వైనం.ఇందులో నిజాలు లేవు..అరెస్టుకి కారణాలు చూచాయగా కూడా లేవు. చేయించిన వారి గురించి అసలేలేవు. చదవడం వల్ల సమయం వృధా.. డబ్బు వృధా

అద్భుతమైన పుస్తకం.డిప్రెషన్ లో వున్నవాళ్లు,ప్రతీ చిన్న విషయానికి కృంగిపోయేవాళ్లు ఈ పుస్తకం చదవాలి.జీవితాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో తెలియజేసిన పుస్తకం.

ఎప్పుడో పాతికేళ్ల క్రితం కథనం..ఇప్పుడెందుకు? జైలు గోడల మధ్య హీరో సుమన్ గడిపిన జీవితం ఎందుకు అవసరం?
జైలు గోడల మధ్య అతను పడ్డ తపన…నేర్చుకున్న జీవిత సత్యాలు.అతని మనో నిబ్బరం..తను నిర్దోషిని అనే నమ్మకం…
ఒక వ్యక్తిత్వ వికాసానికి కావలిసిన అంశాలు, ఒక పాపులర్ నటుడి స్వీయ అనుభవాలు చేదు నిజాలు,నిష్టుర సత్యాలు…
ఇప్పటి తరానికీ అవసరమయ్యే ఎన్నో విషయాలు…
ఈ ఇన్వెస్టిగేటివ్ సీరియల్ రాయడానికి అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు పెట్టిన షరతు ఏమిటి? సుమన్‌ని ఎలా ఒప్పించడం జరిగింది?
ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?
సూపర్ హిట్స్ బిజీగా వున్న హీరో…క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్…షూటింగ్‌లో అలిసిపోయి ఇంటికి వచ్చాక ఓ రాత్రి తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే పోలీసులు. ”మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు”
ప్రపంచం తలక్రిందులు అవ్వడమంటే ఏమిటి?
ఒక హీరోను పోలీస్‌లు అరెస్ట్ చేయడమేమిటి?
తప్పు చేయకున్నా ఆరునెలలు జైలుగోడల మధ్య గడపడం ఏమిటి..?
లైట్స్ కెమెరా యాక్షన్‌ల మధ్య గడిపే హీరో జైలులో ఎలా వున్నాడు?
ఆంధ్రభూమిలో 1991 లో 24వారాలపాటు సీరియల్‌గా వచ్చి సంచలనం సృష్టించిన
ఫ్లాష్ బ్యాక్
జైలు గోడలమధ్య హీరో సుమన్