• Jada Kandamulu Maa Kandamulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • జడ కందములు - మా కందములు (free)

    Jada Kandamulu Maa Kandamulu - free

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పద్యం తెలుగు భాషకు, జాతికి జీవనాడి. ఛందోబద్ధమైన పద్యం ఒక లయను, హృద్యమైన గమనాన్ని కలిగి ఉండి, ధారణకు అనుకూలంగా ఉంటుంది. అందుకే అది పండిత పామర జనరంజకమై, శతాబ్దాలుగా తేజరిల్లుతున్నది. ఆధునిక కాలంలో ఎన్ని కవితా ప్రక్రియలు క్రొత్తక్రొత్తగా వచ్చినా, అవి తాత్కాలికంగా వెలిగి ఆరిపోతున్నాయి. కాని, పద్యం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉన్నది. దీనికి జరామరణాలు లేవు. కొంతకాలం పద్యానికి ఆదరణ తగ్గినా, ప్రస్తుత కాలంలో పద్యం పట్ల ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతున్నది. వయస్సుతోనూ, వృత్తితోనూ సంబంధం లేకుండా, ఎందరో పద్య రచనలు చేస్తున్నారు. ఇది సంతోషింప దగిన, స్వాగతింప దగిన విషయం. ఎందరో పద్యకవులు పుంఖానుపుంఖాలుగా పద్య రచనలు చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న పుస్తకావిష్కరణ సభలు, పద్యకవి సమ్మేళనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాల వేదికలలో ఈ పద్య కవిత్వోద్దృతి స్పష్టంగా కనిపిస్తున్నది.

116 మంది కవులు నాలుగు వందలకుపైగా పద్యాలను పంపారు. ఒక్కొక్కరిని రెండేసి పద్యాలు పంపమంటే, కొందరు ఎక్కువగానే పంపారు. 15 పద్యాలు పంపిన మిత్రులూ ఉన్నారు. శతకంగా ప్రచురించాలంటే ఒక్కొక్క పద్యాన్నే స్వీకరించ వలసి ఉంటుంది. మిత్రులు నిరుత్సాహపడతారు. అందుకని ఒక్కొక్కరిని రెండేసి పద్యాలు స్వీకరించి, 'జడ కందములు - మా కందములు" అన్న పేరుతో పద్య సంకలనం ముద్రించాలని నిశ్చయించుకున్నాను. పద్యాలను పరిష్కరించే పనికి నేను, మధురకవి గుండు మధుసూదన్ గారు పూనుకున్నాము. ఎక్కువ పద్యాలను పంపిన వారిని మాకు నచ్చిన రెండింటిని ఎన్నుకున్నాము. అలా ఎన్నుకున్నపుడు అ కవికి ఎంతో నచ్చిన పద్యం ఇందులో చేరి ఉండకపోవచ్చు. అందుకు మిత్రులు మన్నించాలి.

వస్తువు ఒక్కటే. ఛందస్సూ ఒకటే. కాని కవులు వేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో, ఒక్కొక్క దృక్కోణంతో పద్యాలను వ్రాసారు. పద్యాలను వ్రాసిన కవిమిత్రులలో అవధానులు, డాక్టరేట్ చేసినవారు, ఇప్పటికే ఎన్నో గ్రంథాలను ప్రకటించి లబ్దప్రతిష్టులైనవారు ఉన్నారు. కొత్తగా పద్యాలను వ్రాస్తున్నవారూ ఉన్నారు. విషయం ఒకటే అయినా... భావ వ్యక్తీకరణలో, శైలిలో, పదప్రయోగ నైపుణ్యంలో, ధారలో వైవిధ్యం ఉన్నది. రసజ్ఞులు మీరే గ్రహిస్తారు.

- కంది శంకరయ్య