• Itlu Oka Raitu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇట్లు ఒక రైతు

    Itlu Oka Raitu

    Pages: 163
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

గొర్రెపాటి నరేంద్రనాథ్‌కి వ్యవసాయమన్నా, ప్రజా ఉద్యమాలన్నా ఎనలేని మక్కువ. ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చే 'లోకాయన్' అనే సంస్థతో కలసి పనిచేసేందుకు గాను ఆయన ఢిల్లోలో తన బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ఆ తరువాత చిత్తూరు జిల్లా పాకాల వద్దగల తన స్వగ్రామం వెంకటరామాపురంకు వెళ్ళి సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టారు. గత రెండు దశాబ్దాలుగా ఒక రైతు సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే అంటరానితనంపై, భూ సమస్యపై, నిర్వాసితుల పునరావసంపై, రైతు సమస్యలపై ఎంతో కృషి చేశారు. ఎన్‌ఎపిఎం, హెచ్‌ఆర్‌ఎఫ్, రాష్ట్రీయ రైతు సేవా సమితి వంటి సంస్థలలో పని చేశారు.

సేంద్రీయ వ్యవసాయదారుడిగా మారిన నరేంద్రనాథ్ చేసిన ప్రయోగాలు, సాధించిన ఫలితాలు, వ్యవసాయంలోని మంచి చెడు అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. తన నిజజీవితంలోని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తునే సేంద్రీయ వ్యవసాయ ప్రాధాన్యతను, వ్యవసాయ రంగపు సాధక బాధకాలను, పల్లె జీవితంలోని ఒడిదుడుకులను ఆయన ఈ పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు. రైతులకూ, వ్యవసాయరంగం పట్ల ఆసక్తి ఉన్నవారికే కాక - క్షీణిస్తున్న పర్యావరణం గురించి తరుగుతున్న సహజ వనరుల గురించి ఆందోళన చెందుతున్న వారికీ, తాము తింటున్న ఆహారం మంచిదో చెడ్డదో తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Itlu Oka Raitu
Comment(s) ...

Mana rasthram lo raithulu paduthunna kastalni kallaki kattinattu chuparu.