• Ismat Chugthai Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇస్మత్ చుగ్తాయ్ కథలు

    Ismat Chugthai Kathalu

    Author:

    Pages: 184
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రుఖ్సానా ఒక పేదింటి పిల్ల. తల్లితండ్రుల గుండెలమీద కుంపటి. పెళ్ళికొడుకే ఉభయ ఖర్చులు పెట్టుకోవలసి వచ్చింది పెళ్ళికి. తరువాత ఆమెను చూసి అతనికి చెమటలు పట్టాయి ''అయ్యో! ఇది చిన్నపిల్ల'' అని తోబుట్టువుల దగ్గర బాధపడ్డాడు.

''ఒక మధ్య వయస్కుడికీ ఒక ఇరవై ఏళ్ళ పిల్లకీ పెళ్ళేమిటంటావు కదూ?చూడు భయ్యా, ఈ సౌకుమార్యం అంతా ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టే దాకానే. ఆ తరువాత పై పూతలన్నీ కరిగిపోతాయి. ఈ ఒంటి రంగూ నాజూకు నడుమూ అన్నీ అదృశ్యమై పోతాయి. త్వరలోనే ఆమె నీ వయసు దానిలా కనిపించక పోతే నువ్వు ఏశిక్ష వేసినా భరిస్తాను నిజం! ఇంక పదేళ్లలో ఈమె పెద్దక్కలా తయారువుతుంది చూడు'' అన్నారు వాళ్ళు''ఇష్‌'' అంటూ సిగ్గుపిపోయాడు మామయ్య.

''రెండో భార్య ఎక్కువకాలం బ్రతకదు. అందుకే మేం అప్పుడే మూడో దానికోసం చూస్తున్నాం'' అంది షామా బేగమ్‌... అలా ఎందుకో వివరించారు సోదరీమణులు. ''పూర్వం ఇందుకే రెండో పెళ్ళి ఒక బొమ్మతో జరిపించే వాళ్ళు. అప్పుడు రెండవ భార్య నిజంగా మూడవది అవుతుందన్న మాట,'' అని ఆయన బుర్రకెక్కించారు.

రెండేళ్ళల్లో, మంచి ఆహారం, మంచి బట్టలు బాగా చూసుకునే భర్తా, అన్నీ కలిసి రుఖ్సానా అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. నెలవంక కాస్తా పూర్ణ చంద్రుడయింది. ఆ వెన్నెల వెలుగు చూసేవాళ్ల కళ్ళ బైర్లు కమ్మేలా చేస్తే, ఆయన్ని ఏకంగా పిచ్చివాణ్ణే చేసింది. తొందర్లోనే రిటైరవుతున్నాడు కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఆఫీస్‌ ఎగ్గొట్టి భార్యతో గడిపి ఉద్యోగం పోగొట్టుకునే వాడు.

Preview download free pdf of this Telugu book is available at Ismat Chugthai Kathalu