• Inkokappudu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇం..కొకప్పుడు

    Inkokappudu

    Author:

    Publisher: Samatha Books

    Pages: 182
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంకొ..క..ప్పు..డు


ఉలిక్కిపడి నడిరేయి
నిద్రనుంచి లేచి తలయెత్తి
చీకటికళ్ళతో మబ్బులవెనక చుక్కలా
మసకమసకగా వెలుగుతున్న బెడ్‌లైటుని చూసినప్పుడు,
ఆ క్షణం అర్థం కాలేదు ఆ
క్షీణకాంతి లోపలిదో బయటిదో;
నిరాధార చరమాంక చలనంలో ఈదులాడుతూ
హఠాత్తుగా ఏదో ఒక ఘనీభూతసరస్సులో
నిశ్చేష్టంగా నిలువునా చిక్కుకుపోయినట్టు..
నడిచివచ్చిన దారులతోపాటు
నడవవలసిన దారులుకూడా
అన్నీ మూసుకుపోయినట్టు,
సకలదశలలో సాగరతీరదీపగోపురాలై
రారమ్మని నన్ను లోనికి లాక్కున్న
దశదిశలూ నా కళ్ళముందే అదృశ్యమైనట్టు,
మస్తిష్కతటాకంలో
పొంగిపొర్లడానికి తన్నుకులాడుతున్న తీవ్రభావనలకి
నేనొక లిపిలేని భాషనయినట్టు,
గగనగృహద్వారంలో ఒకరె..వ..రో.. నా కోసం
గోరింటచేతులలో నక్షత్రమాల పట్టుకుని
వెన్నెలకళ్ళతో యెదురు చూస్తున్నట్టు,
అ..ప్పు..డు.. ఏమరుపాటుగా వున్న
నన్ను ఎవరో మెలకువగట్టునుంచి
నిద్దురయేటిలోకి తిరిగి బలంగా తోసినట్టు...
అ..ప్పు..డు..!

Preview download free pdf of this Telugu book is available at Inkokappudu