• Indraja
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంద్రజ

    Indraja

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''సో.... ఏది ఏమైనా సక్సెస్‌ఫుల్‌గా చేశాం... ఇక జీవితంలో ఓంకార్‌ బయటికి రాడు... పెళ్ళి చేసుకోడు.''

''ఏంటి? ఇంద్రజ వస్తుందనే అనుకుంటున్నాడా!?''

''అనుకోవటం ఏమిటి ద్రాక్షరసం అమృతమనుకొని త్రాగి ఇంద్రుడి కూతురు ఇంద్రజ వచ్చి కథలు చెబుతుందని, తనతో ఆడుకుంటుందని కలలు కంటున్నాడు.''

''కొంపదీసి నిజంగా ఇంద్రుడి కూతురు రాదుకదా?''

''వస్తుంది... ఖచ్చితంగా'' ఉజ్వల సీరియస్‌గా చెప్పింది.

ఇద్దరూ ఆమె వంక చూశారు.

''కలలో రోజూ వస్తుంది ఇంద్రజ'' నవ్వింది.

పరబ్రహ్మం గట్టిగా నవ్వి -

''ఇంకా నయం ఇంద్రుడే స్వయంగా వచ్చి తన కూతురిని వీడి చేతిలో పెడతాడని చెప్పావు కాదు.''

అమృతలింగం స్కాచ్‌ బాటిల్‌ వోపెన్‌ చేస్తూ - ''జీవితంలో ఇది తాగాలన్న కోరిక ఈ రోజుకి తీరబోతోంది.'' అన్నాడు.

ఉజ్వల గ్లాసు జరిపింది.

సరిగ్గా ఆమె ఎదురుగా అద్దం వుంది.

తనని తాను చూసుకుంది.

విజయం ఇచ్చిన అహంకార గర్వంతో యవ్వనం మదపుటేనుగులా ఫీుంకరిస్తోంది.

విజయహాసం తళుక్కున మెరిసింది.

Preview download free pdf of this Telugu book is available at Indraja