• Indradhanussu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంద్రధనుస్సు

    Indradhanussu

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జయంతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ఎలా భరిస్తున్నారక్కా మీరు యిలాంటి విషయాన్ని! ఎందుకు వూరుకుంటారు బావగారు అలా చేస్తే!"
వసంత నవ్వింది. "అదేగా చెప్పాను యిందాక! ఎందుకు అంటే నేను జవాబు చెప్పలేనని అన్నాను కదా!" అంది.
ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేనట్లుగా చూస్తున్న జయంతి వైపే చూస్తూ చెప్పింది వసంత. "ఈ రోజుల్లో అందరూ అడుగుతున్న ప్రశ్న జయంతీ యిది! ఎందుకు వూరుకుంటారు? ఎందుకు వూరుకుంటారు? ప్రతివాళ్ళూ యిదే ప్రశ్న. భర్త చేసే అవమానానికి వూరుకోవడం వ్యక్తిత్వం లేకపోవడమనీ... బలహీనత అనీ... సిగ్గులేనితనమనీ చాలా మంది అంటారు. కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకు వూరుకోకూడదు? వూరుకోవడం వూరుకోకపోవడం కంటే వుత్తమం అని తెలిసినపుడు ఎందుకు వూరుకోకూడదు? ఊరుకోకుండా చేయగలిగినదేమిటి? అతనితో వాదించడం... సాధించో.. అలిగో.. ఏడ్చో ఆ అలవాటుని మార్చే ప్రయత్నం చేయడం. వీటన్నిటి వల్లా నాకు సమయం వృధా అవడం తప్ప మరేమీ కనిపించలేదు. నాకు సంబంధించినంతవరకూ నాకు అన్నిటికన్నా నా సమయం ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే ఒక్కొక్కసారి యిలాంటి చిన్న చిన్న అవమానాల గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. మన గౌరవం మరొకరి ప్రవర్తనలో వుందనుకోవడమే అర్ధ రహితం జయంతీ!"
"అక్కా!" అంది జయంతి ఆరాధనగా చూస్తూ. "మిమ్మల్ని ఒకమాట అడగనా!"
"ఏమిటి?" అంది వసంత ఆశ్చర్యంగా.
"మీరు అన్ని విషయాలలోనూ యింతగా అడ్జస్ట్ అవుతారు కదా! అందరితోనూ యింత బాగా కలిసిపోతారు కదా! మరి మమ్మల్ని ఎందుకక్కా యిన్నిరోజులూ మీరు క్షమించలేదు! మేం చేసిన తప్పేం వుంది! ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. అంతే కదా! అంత చిన్న విషయానికి మీరు మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?"

Preview download free pdf of this Telugu book is available at Indradhanussu