• Ikkada Gnanam Vikrayimpabadunu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇక్కడ జ్ఞానము విక్రయింపబడును

    Ikkada Gnanam Vikrayimpabadunu

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బుద్ధుడి శిష్యవర్గంలో మోంగ్‌వ్యాన్ గౌతమబుద్ధుడి వద్దకు వెళ్ళి “భగవాన్, పై వారంలో మీ స్వజనం అనేకులు మరణించనున్నారని మీకు తెలుసా” అని ఆదుర్దాగా అడిగాడు.

“తెలుస”న్నాడు బుద్ధుడు నెమ్మదిగా,

“ఐతే మరి వారిని రక్షించడానికి పూనుకుంటున్నారా?” అన్నాడు మోంగ్‌వ్యాన్.

“నావల్లకాదు” అన్నాడు బుద్ధభగవానుడు.

“మీకు మానవాతీతమైన శక్తులున్నాయి కదా? అవసరమొచ్చినపుడు అద్భుతాలు చేయగలరు. వారినెందుకు కాపాడకూడదు?” అని అడిగాడు.

“చేసుకున్న కర్మ ననుభవించక తప్పదు నాయనా” అన్నాడు బుద్ధుడు.

కానీ మోంగ్‌వ్యాన్‌కు బుద్ధుడి మాటల్లో నమ్మకం కుదరలేదు. బుద్ధుడికి తగినంత కరుణలేదని భావించి ఆగ్రహావేశుడయ్యాడు. ఇక ఆయన మీద ఆధారపడి లాభం లేదని తానే పూనుకున్నాడు. కపిలవస్తు రాజ్యాన్నంతా కలిపి ఒక చిన్న ఉండగా తయారుచేసి ఒక ఆహారపాత్రలో పడేశాడు. ఆ పాత్రమీద మూతపెట్టి దాన్ని తీసుకొని లోకాలన్నీ దాటి కడపటి స్వర్గం మీదికి తీసుకెళ్ళాడు. సుఖశాంతులు నెలకున్న ఆ స్వర్గంలోని ఒక రాజమందిరంలో ఆ పాత్రనుంచి తిరిగివచ్చాడు.

వారం రోజుల గడువు తీరిపోయింది. ఆదివారం మధ్యాహ్నం దాటిపోయింది. గండం గడిచిందని సంతోషిస్తూ హుటాహుటున ఆ స్వర్గానికి వెళ్ళి ఆ పాత్రను జాగ్రత్తగా భూమిమీదకు తీసుకువచ్చాడు. మూతతీసి చూచాడు. చిన్న పరిపరిమాణంలోకి మారిన కపిలవస్తు రాజ్యం, ఒక చిన్నపాటి యుద్ధకారణంగా సర్వనాశనమైందని గ్రహించాడు మోంగ్‌వ్యాన్.

Preview download free pdf of this Telugu book is available at Ikkada Gnanam Vikrayimpabadunu