• Iguram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇగురం

    Iguram

    Author:

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమ్మ నేను పెద్దమ్మ తాన కూకున్నం. ఆమె ఏదో చెప్పాలని ఆరాటపడ్తు పెదాల్ని ఆడిస్తుంది. ఆ రోజు ఊరంతా సీకటి, సిమ్మసీకటి అల్ముకుంది పుల్ముకుంది. రంగరించి సిమ్మసీకటి రాసుకుంది. ముస్రువాన లెక్క ముస్రుకుంది. కారు సీకటి కమ్ముకుంది. ఊర్ల మన్సులున్నా లెనట్క ఉంది. ఊరు కారడవిలా ఉంది. ఊరు అక్కడక్కడ గుసగుస, మిన్కుమిన్కు మిన్ను పుర్గులెక్క, ఆడడ ఎల్తురు. సంకురాతిరి సలిమంటలెక్క ఎల్తురు. పిల్లపీసు కీసుమంట లేదు. ఊరంతా ఒకటే జోలి, ఏనోరు జూస్నా అదే జోలి, రాజోలి బండ లెక్క రగులుతుంది. నిప్పులేని పొగ ఊరు కమ్ముకుంది. ''ఆ ఒక్క ఇల్లుదప్ప అందరిండ్లల్ల అదే. ''ఎంత అన్యాలమైపాయెరా..''

ఆ ఇంట్కి, ఆ ఇంటి తల్లికి, ఆతల్లి కొడుక్కి, సూస్త సూస్త బత్కులు ఎట్టయిపాయె. సిట్కల ఆగమాయమై పాయె. ఆ ఇంట్కాయి సూస్తోడు లేకపాయె. కన్నెత్తి సుడల్ననున్నా మన మెడకేం సుట్కుంటదోనన్న దిగులు, గుబులు. కంట్కి కున్కురాలె ఒంట్కి గునుపుపోలె. మట్లాల్ననున్న పెదుందాటి మాటబైట్కి రాలే. కన్నెత్తి సుద్దామంటె దైర్నం సాల్దంలే. గుండెదైర్నం పెంట్కోని కాళ్ల బందాలు కట్టలు దెంచ్కొవాల్ననున్నా అదంతా కల్గినోని కావురం ముంగల ఆని కండకావురం ముంగల దిగదుడుపై తున్నయ్‌. కడ్పుల బాద కుతకుత ఉడ్కుతున్నా, సలసల కాగుతున్నా మారు మాట్లాలేని దైన్యం. ఎద్రించలేని దీనస్థితి ఊరుది. ఎవలు ఆ ఇంట్కి ఆసరైతరు ఎవలొచ్చి ఆఇంట్ల దీపం ఎల్గిత్తరు, ఎవలొచ్చి ఎడగ నిబ్బరంగుండని సెప్తరు. ఎవరూ లేరు. అంతా నీళ్లు నమ్లి మింగెటోళ్లె గన్మ దాటెటోడు ఎవడూ లేరు. ఆల్లది పిర్కితనం కాదు. ఆళ్లదైర్నం డబ్బు ముంగల, ఆవూరి దొరతనం ముంగల బలాదూరైంది. ఎంజేత్తం ఇంట్ల ఉండల్సిందేనా. ఆళ్ల ఆగం ఇట్ట సాగాల్సిందేనా. ఆఇంటి లెక్క అందరూ బలికావల్సిందేనా... మనకంట్ల మనేలు పెట్టి పొడుస్తుంటే సూసి ఊరుకోవాల్సిందేనా.. ఏం పట్టనట్టు మనం పీనిగెలెక్క బత్కాల్సిందేనా... ఏమో...

Preview download free pdf of this Telugu book is available at Iguram