• Hyderabad Nunchi Oka Rojulo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హైదరాబాద్ ను౦చి ఒక రోజులో

    Hyderabad Nunchi Oka Rojulo

    Pages: 190
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హైదరాబాద్ ను౦చి ఒక రోజులో దర్శించదగ్గ ఆలయాల చరిత్ర అనే భావనే చక్కని ఆసక్తి గొలుపుతు౦ది. శ్రీమతి పి.ఎస్.ఎం. లక్ష్మి గారు దానిని చక్కని రచనగా మలచారు. మొత్తం 72 ఆలయాల గురించి ఈ రచనలో ఆమె తెలియజేశారు. ప్రధానంగా భాగ్యనగర వాసులు, నగరానికి వచ్చి వెళ్ళే వారు వారాంతాలలో ఆలయ సందర్శన చేసి రావాలని తలపెట్టడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. ఉపయుక్తమైన ఇలా౦టి పుస్తకాలను అంతర్జాల సదుపాయమైన కినిగె డాట్ కామ్ ద్వారా అ౦దుబాటులోకి తేవడ౦ పాఠకులకు మరింత మేలైన సేవ.

ఇది యాత్రా దీపిక శీర్షిక మీద ఆమె రాసిన నాలుగో పుస్తకం. తక్కిన మూడూ యాత్రాదర్శని-నల్గొండ జిల్లా, ప౦చారామాలూ- పరిసర క్షేత్రాలూ, యాత్రా దీపిక - వరంగల్ జిల్లా. మరుగున పడిపోతున్న ఆలయాల గురించి పదిమ౦దికీ వివరించి, వాటి పునర్వైభవానికి ప్రేరణ కలిగించాలని శ్రీమతి లక్ష్మి గారి ఆశయం. దంపతిగా తాము దర్శించిన ఎన్నెన్నో ఆలయాలకు చారిత్రక ఆధారాలు లేకుండా పోయినట్లుగా తెలుసుకుని ఆమె ఎంతో ఆవేదన చెందారు. అయితే, ఆవేదనతో ఊరుకోక, తన వ౦తుగా వాటి గురించి రాసి, ఛాయాచిత్రాలతో సహా గ్రంథస్థం చేయడం అభినందనీయం.

జీర్ణ దేవాలయోద్ధరణ అంటే, శిథిలమవుతున్న మన స౦స్కృతిని, దివ్య వారసత్వాన్ని తిరిగి ఉద్ధరించుకోవడమే. అట్టి బృహత్ యజ్ఞంలో ఇలాంటి గ్రంథ రచన కూడా భాగం. ఇ౦తటి యజ్ఞంలో భాగస్వాములు కావడం శ్రీమతి లక్ష్మి దంపతి పట్ల పరమేశ్వరుని అనుగ్రహం మాత్రమే కాదు, ఆ దంపతి ఔన్నత్యం కూడా. వారి ఈ ఉద్యమం మరింత ము౦దుకు సాగాలనీ, సుందరేశ్వర స్వామి సమేత శ్రీశ్రీశ్రీ ఐశ్వర్యాంబికా దేవి ఆశీస్సులు వారికి పరిపూర్ణంగా లభించాలనీ మంగళాశాసనం పలుకుతున్నాను.
ఇతి శం.

- స్వామి పరిపూర్ణాన౦ద

Preview download free pdf of this Telugu book is available at Hyderabad Nunchi Oka Rojulo