• Humourology
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హ్యూమరాలజీ

    Humourology

    Author:

    Pages: 328
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిర్భయ్‌నగర్ కాలనీ చాలా హడావిడిగా ఉంది. కాలనీ వాళ్ళందరూ కాలనీ మధ్య పార్కులో చేరారు.

“సోదరులారా!” అన్నాడు గోపాల్రావ్ – అని చుట్టూ చూశాడు. ఆడామగా పిల్లా పీచూ అతనేం చెప్తాడా అని ఎదురు చూడసాగారు. గోపాల్రావ్ జర్నలిస్టు. అంచేత ఎప్పుడూ ఒకరు చెప్పింది రాసుకోడమే గాని మాట్లాడడం తెలీదు. అందుకని ఆ తరువాతేం మాట్లాడాలో తెలీలేదు. రెండు క్షణాలాగి మళ్లీ పెద్దలారా అన్నాడు. మరుక్షణం ఆగి “పిల్లలారా!” అన్నాడు.

“పోనీలే – మామూలుగా మాట్లాడు” అన్నారెవరో. ఆ మాటతో గోపాల్రావ్ ఉత్సాహం పుంజుకున్నాడు.

మన కాలనీ కూడా ఊరికి చివరగా వుంది కాబట్టి ఏ క్షణాన్నయినా దొంగలు “క్యూ” కట్టి దోచుకోవచ్చని అనుమానంగా ఉంది. ఎందుకంటే మాన్యూస్ పేపర్ల వార్తలను బట్టి దొంగలు ఇప్పటికే హైదరాబాదులోని ఊరి బయట కాలనీలన్నీ పూర్తి చేశారు. వాళ్ళ లిస్టులో మన కాలనీ ఒక్కటే మిగిలిపోయింది. కనుక మనం ముందే చోరనిరోధక చర్యలు తీసుకుంటే బావుంటుందని ఇవాళ ఇక్కడ కలుసుకున్నాం! కనుక ఏ చర్యలు తీసుకోవాలో ఎవరికితోచింది వారు చెప్పితే బాగుంటుంది అంటూ ముగించాడు.

శాయీరామ్‌లేచి నిలబడ్డాడు.

Preview download free pdf of this Telugu book is available at Humourology